Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా పీవీ సింధు.. సానియా మీర్జా కథ కంచికేనా?

ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌లో ధీటుగా రాణించి రజత పతకాన్ని సొంతం చేసుకున్న తెలుగు తేజం పీవీ సింధుకు క్రేజ్ బాగా పెరిగిపోతోంది. రియో ఒలింపిక్స్ 2016లో సింధు ఫైనల్లో గెలిచి స్వర్ణం గెలవాలని యావత్ భారత

Webdunia
ఆదివారం, 21 ఆగస్టు 2016 (14:38 IST)
ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌లో ధీటుగా రాణించి రజత పతకాన్ని సొంతం చేసుకున్న తెలుగు తేజం పీవీ సింధుకు క్రేజ్ బాగా పెరిగిపోతోంది. రియో ఒలింపిక్స్ 2016లో సింధు ఫైనల్లో గెలిచి స్వర్ణం గెలవాలని యావత్ భారత దేశం పూజలు చేసింది. అందరి పూజలు ఫలించాయి. స్వర్ణం కాకపోయినా రజతంతో దేశానికి గుర్తింపు సంపాదించిపెట్టింది. ఈ నేపథ్యంలో పీవీ సింధు క్రేజ్‌‌తో ఫ్యాన్స్ ఇద్దరు క్రీడాకారిణిలను టార్గెట్ చేస్తున్నారు.
 
అందులో ఒకరు సైనా నెహ్వాల్. మరొకరు సానియా మీర్జా. ఇప్పటికే సైనా పైన ఓ క్రీడాభిమాని.. సైనా బ్యాగ్ సర్దుకొని రావాలని ట్వీట్ చేశారు. దానికి సైనా హుందాగా సమాధానం చెప్పింది. అలాగే చేస్తానని బదులిచ్చింది. దీంతో సదరు అభిమాని పశ్చాత్తాపపడ్డాడు.
 
మరోవైపు టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను కూడా టార్గెట్ చేస్తున్నారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా సానియా మీర్జా స్థానంలో మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించే పీవీ సింధుని ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నామంటూ.. ఫేస్‌బుక్‌లో ఓ కామెంట్, ఫోటో హల్ చల్ చేస్తోంది. సామాజిక మీడియాతో పాటు దేశ వ్యాప్తంగా పీవీ సింధు పేరుకు సూపర్ క్రేజ్ లభించిన తరుణంలో సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌ పదవి నుంచి తప్పించే అవకాశం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. 
 
సంప్రదాయాలకు విలువనిచ్చే పీవీ సింధును తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎందుకు నియమించకూడదని చర్చ మొదలు కావడంతో.. తెలంగాణ సీఎం కేసీఆర్ సానియాను బ్రాండ్ అంబాసిడర్‌గా తొలగించి పీవీ సింధును ఎంపిక చేసే అవకాశాలు లేకపోలేదని సమాచారం. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments