Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు జిల్లాలో కరోనా విశ్వరూపం.. రెడ్ జోన్లుగా ఆరు ప్రాంతాలు

Webdunia
శనివారం, 4 ఏప్రియల్ 2020 (14:30 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ విశ్వరూపం చూపించింది. ఈ ప్రాంతానికి చెందిన అనేక మంది ముస్లింలు ఢిల్లీలో జరిగిన మర్కజ్ మత సమ్మేళనంలో పాల్గొని తిరిగివచ్చారు. ఇలా వచ్చిన వారిలో చాలా మందికి ఈ వైరస్ సోకింది. ఫలితంగా జిల్లాలో పలు కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి కరోనా వైరస్ సోకిన బాధితులు నివసించే ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆనంద్ కుమార్ ఓ ప్రకటన చేశారు.
 
జిల్లాలో గుంటూరు, మాచర్ల, అచ్చంపేట, క్రోసూరు, మేడికొండూరు(తురకపాలెం), మంగళగిరి పాంత్రాలను రెడ్‌జోన్లుగా చేశామని చెప్పారు. రెడ్‌జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో శనివారం నుంచి ఆంక్షలు కఠినతరంగా అమలు చేస్తామన్నారు. ఆ జోన్లలో ఏ ఒక్కరూ నిత్యావసర సరుకులకు కూడా బయటకు రావడానికి వీల్లేదని హెచ్చరించారు. 
 
అధికార యంత్రాంగమే ఆ ప్రాంతాలకు అన్ని సరుకులు తీసుకొచ్చి సరఫరా చేస్తుందన్నారు. వైరస్‌ పాజిటివ్‌ కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. లాక్‌డౌన్‌ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 
 
అదేవిధంగా ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారిలో ఇంకా 20 మందిని గుర్తిం చాల్సి ఉందని చెప్పారు. వైద్య, ఇతర సిబ్బందిని ఎవరైనా అడ్డగిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. వైరస్‌ వ్యాప్తి నివారణ, సహాయక చర్యల కోసం విరాళాలు ఇచ్చేవారు కలెక్టరేట్‌లో సంప్రదించాలని కలెక్టర్ ఆనంద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప-2 నుంచి దేవీ శ్రీ ప్రసాద్‌ను పక్కనబెట్టేశారా? కారణం?

పారిశ్రామికవేత్త బర్త్‌డే పార్టీలో ఎంజాయ్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోలు

త్రిబాణధారి బార్బరిక్ లో సరికొత్త అవతారంలో ఉదయ భాను

అమ్మవారి జాతర నేపథ్యంగా జాతర- మూవీ రివ్యూ

రామ్ చ‌ర‌ణ్ గేమ్ చేంజర్ టీజ‌ర్ రిలీజ్‌కు 11 చోట్ల భారీ స‌న్నాహాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments