Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలోని మద్యం బాబులకు చేదువార్త... మద్యం షాపులు బంద్!!

ఠాగూర్
బుధవారం, 29 మే 2024 (12:59 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మద్యంబాబుకు ఓ చేదువార్త. రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు మద్యం షాపులు మూతపడనున్నాయి. జూన్ నెల మూడో తేదీ నుంచి ఐదో తేదీ వరకు ఈ షాపులను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 13వ తేదీన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఓట్ల లెక్కింపు జూన్ నాలుగో తేదీన జరుగనుంది. ఓట్ల లెక్కింపు సాఫీగా జరిగేందుకు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు వీలుగా కౌంటింగ్‌కు ఒక్క రోజు ముందు.. ఒక్క తర్వాత ఈ షాపులను మూసివేయాలని డీజీపీ హరీష్ కుమార్ ఆదేశాలు జారీచేశారు. 
 
అలాగే, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. అదేవిధంగా హోటళ్లు, లాడ్జిలలో తనిఖీలు చేపట్టి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలని జిల్లా పోలీస్ ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. సోషల్ మీడియాపై ఓ కన్నేసి ఉంచాలని, తప్పుడు సమాచారం వ్యాప్తి కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు తగిన ఉత్తర్వులు జారీచేశారు. 
 
ఆదాయానికి మించిన ఆస్తుల కేసు : ఏసీబీ కస్టడీకి ఏసీపీ! 
 
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయిన ఏసీపీ ఉమామహేశ్వర రావును విచారణ నిమిత్తం అవినీతి నిరోధక శాఖ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఏసీబీ కోర్టులో కస్టడి పిటిషన్ దాఖలు చేయగా, దానిపై విచారణ జరిపిన కోర్టు.. మూడు రోజుల పాటు కష్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో అక్రమాస్తుల వివరాలను వెలికి తీసేందుకు ఏసీపీని ఏసీబీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. అయితే, ఏసీబీ పది రోజుల పాటు కస్టడీ కోరగా మూడు రోజులు మాత్రమే కస్టడీకి  అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసింది. 
 
ఈ నెల 22వ తేదీన ఏసీపీ ఉమామహేశ్వర రావు నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో రూ.3.95 కోల్ విలువైన ఆస్తులను అధికారులు గుర్తించారు. దీంతో ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీపీని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా, కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఏసీపీని చంచల్‌గూడ జైలుకు తరలించారు. తాజాగా జైలు నుంచి ఏసీపీ ఉమామహేశ్వర రావును ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్‌బాస్‌ నెక్స్ట్ సీజన్‌లో వేణుస్వామి ఫిక్స్.. చరిత్రలోనే అత్యధిక పారితోషికం..??

నేను OG అంటే మీరు క్యాజీ అంటే నేనేం చేయాలి: పవన్ కల్యాణ్ (video)

35-చిన్న కథ కాదు'- మనందరి కథ : హీరో రానా దగ్గుబాటి

సుహాస్ హీరోగా కోర్టు డ్రామా జనక అయితే గనక.. ఫస్ట్ లుక్

పేక మేడలు సినిమా నుంచి సెకండ్ సింగిల్ ఆడపిల్ల .. విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments