Webdunia - Bharat's app for daily news and videos

Install App

చివరి రక్తపుబొట్టువరకు జగనన్న కోసం పని చేస్తా.. సత్తా ఏంటో చూపిస్తా : ఆర్కే.రోజా

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (08:51 IST)
తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నగరి ప్రజల కోసం పని చేస్తానని, చివరి రక్తపుబొట్టువరకు జగనన్న కోసం పని చేస్తానని ఏపీ రాష్ట్ర పర్యాటక మంత్రి ఆర్.కె.రోజా అన్నారు. ఆమె మంత్రిగా నగరిలోని తన నివాసానికి తొలిసారి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె ఘన స్వాగతం లభించింది. నగరి నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మంత్రిగా తన సత్తా ఏమిటో చూపిస్తానని అన్నారు. ఇప్పటివరకు ఒక లెక్కని, ఇకపై మరో లెక్క అని పేర్కొన్నారు. తనకు కేటాయించిన పర్యాటకశాఖ ద్వారా రాష్ట్రానికి ఆర్థిక వనరులు సమకూర్చడంపై దృష్టి సారిస్తానన్నారు.
 
తనకు ఇక సీటు రాదని, రోజా పని అయిపోయిందని ప్రచారం జరిగిందని, అలా ఎగతాళి చేసిన వారి నోళ్లు మూతపడేలా ఇక్కడి ప్రజలు తనను రెండుసార్లు గెలిపించారని అన్నారు. తల్లిదండ్రులు తనకు జన్మనిచ్చారని, నగరి ప్రజలు తనకు రాజకీయ జన్మనిచ్చారని పేర్కొన్నారు. 
 
2024లోనూ వైపాకా అధికారంలోకి వస్తుందని, వైఎస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని రోజా ధీమా వ్యక్తం చేశారు. తన కంఠంలో ప్రాణమున్నంత వరకు నగరి ప్రజలకు సేవ చేస్తానని, చివరి రక్తపు బొట్టు వరకు జగనన్న కోసం పనిచేస్తానని రోజా పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిలుకూర్ బాలాజీని దర్శించుకున్న ప్రియాంకా చోప్రా

Venu Swamy: నాగ చైతన్య-శోభితలకు వేణు స్వామి క్షమాపణలు.. ఇకపై నోరెత్తను

యూఫోరియా మ్యూజికల్ నైట్ లో ప్రతి ఒక్క రూపాయి సమాజ సేవకే : నారా భువనేశ్వరి

పుష్ప 2 కలెక్షన్స్ రూ. 1850 కోట్లు వచ్చాయా? లెక్కలేవీ అని ఐటీ అడిగిందా?

హాసం రాజా ఆపాతమధురం -2 పుస్తకావిష్కరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

పాండ్స్ యూత్‌ఫుల్ మిరాకిల్ రేంజ్ లాంచ్

ప్రతిరోజూ బాదం తినడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు

Golden Milk: గోల్డెన్ మిల్క్ హెల్త్ బెనిఫిట్స్

తర్వాతి కథనం
Show comments