గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌న్ స్పందిస్తారా? లేక టీడీపీది వృధా ప్ర‌యాసేనా?

Webdunia
శుక్రవారం, 22 అక్టోబరు 2021 (11:05 IST)
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కేంద్ర కార్యాలయంలో దాడికి సంబంధించి ఆ పార్టీ నాయ‌కులు రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌న్ హ‌రిచంద‌న్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆయ‌న ఎలా స్పందిస్తారో అని టీడీపీ నాయ‌కులు వేచి చూస్తున్నారు. అయితే, గ‌వ‌ర్న‌ర్ స్పందిస్తారా?  లేక టీడీపీది వృధా ప్ర‌యాసేనా అనేది అనుమానాస్ప‌దంగా ఉంది. 
 
మొన్న వైసీపీ గుండాలు టీడీపీ ప్ర‌ధాన కార్యాల‌యం లోపలకు వెళ్లి అక్కడ ఉన్న కార్లు, ఆఫీస్ ఫర్నిచర్ ధ్వంసం చేసి, పార్టీ కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బందిని, కార్యకర్తల‌పై దాడి చేశార‌ని టీడీపీ నాయ‌కులు గవర్నర్ ను కలిసి వివ‌రించారు. ఆయ‌న‌కు నివేదిక ఇచ్చిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఇత‌ర టీడీపీ ముఖ్య నేతలు గ‌వ‌ర్న‌ర్ ముందు కొన్ని డిమాండుల‌ను ఉంచారు. అనంతరం మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు త‌మ డిమాండుల‌పై వివ‌రించారు. 
 
గవర్నర్ ముందు రెండు డిమాండ్లు పెట్టాం అని టీడీపీ నేత‌లు చెప్పారు. రాష్ట్రంలో ఆర్టికల్ 356 విధించాల‌ని డిమాండు చేస్తూ, టీడీపీ కార్యాలయంపై దాడుల గురించి వివరించామ‌న్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఘోరంగా క్షీణించాయ‌ని, వాటిని అదుపులో పెట్టేందుకు గ‌వ‌ర్న‌ర్ క‌ల్పించుకోవాల‌ని టీడీపీ నేత‌లు డిమాండు చేశారు. త‌మ ఫిర్యాదుపై గవర్నర్ సానుకూలంగా స్పందించార‌ని టీడీపీ నేత‌లు తెలిపారు. అయినా, ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తామ‌న్నారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో పనిచేసే కార్మికులపైనా దాడి చేశార‌ని టీడీపీ నేత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments