Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవసరమైతే తాడేపల్లిగూడెం నుంచే పోటీ చేస్తా: పవన్

Webdunia
సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (21:07 IST)
అవసరమైతే తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ నియోజకవర్గ పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు.

అమరావతిలో తాడేపల్లిగూడెం ఇన్‌చార్జి బొలిశెట్టి శ్రీనివాస్‌ నేతృత్వంలో పవన్‌ కల్యాణ్‌ నియోజకవర్గ సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో పార్టీ కేడర్‌కు అధికార పార్టీ నుంచి వస్తున్న వేధింపులను బొలిశెట్టి ఈ సందర్భంగా తమ అధినేత దృష్టికి తీసుకెళ్లారు.

అప్రజాస్వామికంగా వార్డుల విభజన, ఏకపక్షంగా పట్టణంలో గ్రామాల విలీనాన్ని పవన్‌ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై అవకాశం ఉంటే న్యాయపోరాటం చేస్తామని, అందుకు సహకరించాలని బొలిశెట్టి కోరారు. పట్టణంలో ప్రభుత్వ భూముల కబ్జాను ప్రస్తావించారు. ఈ విషయాలపై పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. 
 
అధికార పార్టీ వేధింపులపై అవసరమనుకుంటే స్వయంగా వచ్చి గూడెంలో కూర్చుంటానని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. పార్టీ శ్రేణుల కోరిక మేరకు అవసరమైతే గూడెంలో పోటీ చేస్తానంటూ ఉత్సాహపరిచారు.

భారతీయ జనతా పార్టీతో సంప్రదింపులు జరిపిన తర్వాత మునిసిపల్‌ ఎన్నికల్లో పార్టీ విధివిధానాలను వెల్లడిస్తామని పవన్‌ తెలిపారు. ఆ మేరకు పార్టీ శ్రేణులు కష్టపడాలని కోరారు.

సమీక్షలో గూడెం నాయకులు వర్తనపల్లి కాశీ, మైలవరపు రాజేంద్ర ప్రసాద్‌, గుండుమోగుల సురేశ్‌, మారిశెట్టి అజయ్‌, మారిశెట్టి పోతురాజు, అడపాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments