Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్రహింసలు భరించలేక.. తాగుబోతు భర్తకు విషమిచ్చి...

ప్రతి రోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చి తాగుబోతు భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక ఆ ఇల్లాలు కట్టుకున్న భర్తకే విషమిచ్చి చంపేసింది. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్త

Webdunia
సోమవారం, 5 మార్చి 2018 (15:36 IST)
ప్రతి రోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చి తాగుబోతు భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక ఆ ఇల్లాలు కట్టుకున్న భర్తకే విషమిచ్చి చంపేసింది. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
గత నెల 26వ తేదీన రాం మనోహర్ లోహియా హాస్పిటల్ నుంచి ఢిల్లీ పోలీసులకు ఓ ఫోన్ వచ్చింది. శ్రీనివాస్ మూర్తి అనే స్పృహలో లేని ఓ వ్యక్తిని తీసుకొచ్చారని, అతనికి ట్రీట్మెంట్ ఇస్తున్న సమయంలోనే మరణించాడని పోలీసులకు ఆసుపత్రి సిబ్బంది చెప్పారు.
 
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అతన్ని తీసుకొచ్చిన మహిళ తప్పుడు పేరు, చిరునామా ఇచ్చినట్లు గుర్తించారు. అక్కడి సీసీ కెమెరాలను పరిశీలించగా.. ఆ మహిళ వచ్చిన కారు కనిపించింది. దానిని నంబర్ ట్రాక్ చేసి కాలిబరిలోని ఆ మహిళ ఇంటిని గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా ఆమె పేరు కేవీ రమగా తేలింది. ఈమె మృతుడి భార్య అని తేలగా, భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక విషమిచ్చి చంపినట్లు అంగీకరించింది. 
 
రోజు తాగివచ్చి గొడవ చేసేవాడని.. ఇక భరించడం కష్టంగా భావించే తన భర్తకు విషం ఇచ్చి చంపానని తెలిపింది. భగత్‌సింగ్ అనే ఆ తాంత్రికుడే ఆ విషన్నిచ్చినట్లు ఆమె చెప్పింది. ఆమెపై ఐసీసీ సెక్షన్లు 302, 120బీ, 201ల కింద కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్ ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

కొన్ని రోజులు థియేటర్స్ లో వర్క్ చేశా, అక్కడే బీజం పడింది : హీరో ధర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments