Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను పప్పుకాడతో కొట్టి చంపేసింది.. తర్వాత అలా డ్రామా చేసింది..

Webdunia
మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (15:02 IST)
ప్రియుడి కోసం భర్తను చంపేసింది. చివరికి ఆత్మహత్యలా చిత్రీకరించింది. అసలు విషయం బయటపడటంతో చిక్కుల్లో పడింది. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. భర్త హత్యకు పప్పు కాడనే ఆయుధంగా మార్చుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. అనంతపురం, కళ్యాణదుర్గం మండలం దొడ్డి కుంట గ్రామంలో ఉండే శ్రీనివాస్ చౌదరి అనే వ్యక్తికి 9 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి 7 ఏళ్ల కూతురు కూడా ఉంది. ఇక అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో భార్య అదే ప్రాంతానికి చెందిన ప్రభాకర్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం నెరపింది. ఇక ఈ విషయం భర్త వరకు వెళ్లడంతో తీరు మార్చుకోవాలి అంటూ భార్యను పలుమార్లు హెచ్చరించాడు. 
 
ఈ విషయంపై భార్యాభర్తలు ఇద్దరూ ఈ మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఇక భార్య ప్రవర్తనతో తీవ్ర మనస్తాపం చెందిన శ్రీనివాస్ చౌదరి మద్యానికి బానిసగా మారిపోయాడు. నిత్యం మద్యం మత్తులో వచ్చి భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. ఇటీవల ఇలాగే మద్యం తాగి వచ్చి భార్యతో ఘర్షణకు దిగాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో గొడవ పెద్దది అయ్యింది. 
 
ఈ క్రమంలోనే మద్యం మత్తులో ఉన్న భర్త శ్రీనివాస్‌ను భార్య పక్కనే ఉన్న పప్పు కాడతో తలపై దారుణంగా కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇక భర్త ఉరి వేసుకున్నట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. కానీ మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితురాలిని అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments