Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్ ప్రియుడి కోసం భర్తను చంపేసిన ముగ్గురు పిల్లల తల్లి!

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2022 (09:56 IST)
వివాహేతర సంబంధాలు, ఆన్‌లైన్ పరిచయాలు పచ్చని సంసారాల్లో చిచ్చురేపుతున్నాయి. హత్యలకు కూడా దారితీస్తున్నాయి. తాజాగా ముగ్గురు పిల్లల తల్లి తన ఫేస్‌బుక్ ప్రియుడి కోసం భర్తను చంపేసింది. తన ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపేసింది. ఈ దారుణం ఏపీలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆళ్ళగడ్డలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఆళ్లగడ్డకు చెందిన ఆటో డ్రైవర్ కరీముల్లా అనుమానాస్పదరీతిలో హత్యకు గురయ్యాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో కరీముల్లా భార్య మాబ్బి ఫోన్ నుంచి కడప జిల్లా పెద్దముడియం మండలం జె.కొత్తపల్లి గ్రామానికి చెందిన వంశీకుమార్ రెడ్డితో ఆమె ఫోనులో ఎక్కువగా మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. 
 
ఈయన ఫేస్‌బుక్ ద్వారా మాబ్బికి పరిచయమయ్యాడు. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో భర్తను అడ్డు తొలగించుకుంటే ప్రియుడితో సంతోషంగా ఉండొచ్చని పబ్బి భావించింది. ఈ విషయాన్ని ఆమె తన ప్రియుడికి చేరవేసింది. ఈ క్రమంలో ఈ నెల ఒకటో తేదీన మద్యం సేవించి ఇంట్లో నిద్రపోతున్న కరీముల్లా మెడకు తీగ బిగించి ఊపిరాడకుండా హత్య చేశారు. 
 
తర్వాత రోజు ఇద్దరూ కలిసి కరీముల్లా మృతదేహాన్ని తీసుకెళ్లి పొదల్లో పడేశారు. మాబ్బి వయసు 33 సంవత్సరాలుకాగా, ఈమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన వంశీకుమార్ రెడ్డి వయస్సు 22 యేళ్లు. కరీముల్లాను హత్య చేసిన తర్వాత మాబ్బి, వంశీకుమార్ రెడ్డిలు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 
 
హత్య చేసిన తర్వాత పోలీసులకు చిక్కకుండా ఎన్నో రకాలైన ప్లాన్లు వేశారు. చివరకు ఆమ ప్రవర్తనను సందేహించిన పోలీసులు.. ఆమె మొబైల్ ఫోన్ కాల్ డేటాను విశ్లేషించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమెతో పాటు ప్రియుడు వంశీకుమార్ రెడ్డిని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments