Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీతానగరం అత్యాచార బాధితురాలికి సీఎం ఎందుకు న్యాయంచేయలేకపోయారు?: దివ్యవాణి

Webdunia
శనివారం, 17 జులై 2021 (17:51 IST)
వైసీపీ సోషల్ మీడియా విభాగంవారు, వైసీపీ సానుభూతిపరులు చీప్ ట్రిక్స్, చిల్లరచేష్టలు కట్టిపెట్టాలని, నందిని పందిని, పందిని నందిని చేయడంలో వారికివారే సాటనే విషయం రాష్ట్రమంతా తెలుసునని, టీడీపీ అధికారప్రతినిధి శ్రీమతి దివ్యవాణి తెలిపారు.

ఏదో న్యూస్ ఛానల్లో తానేదో మాట్లాడితే, దానికి తలాతోక కత్తిరించి, తానుపార్టీ మారబోతున్నానంటూ దుష్ప్రచారంచేశారని, వైసీపీ సోషల్ మీడి యా వారు, సిగ్గూఎగ్గూలేకుండా అలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడం మానుకోవాలని టీడీపీ మహిళానేత తీవ్రస్వరంతో హెచ్చరించారు.

అప్పుచేసి పప్పుకూడు పెట్టడం పరిపాలన కాదని, చంద్రబాబునాయుడు ఏంటో, ఆయన పనితీరు ఏంటో ప్రజలకుతెలుసునని, వారంతా సమయంకోసం ఎదు రుచూస్తున్నానని తానంటే దానికి వక్రభాష్యాలుచెబుతూ, అధికారపార్టీ సోషల్ మీడియావారు వికృతానందం పొందు తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. వారి దిగజారుడు వ్యాఖ్యలు, చేష్టలుచూస్తుంటే, తనకుజాలేస్తోందన్నారు.

నిజంగా వైసీపీ సోషల్ మీడియావారికి దమ్ము, ధైర్యముంటే ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రానికిమహిళ ముఖ్యమంత్రి  గాఉన్నారని చెప్పారని, దాన్ని  ట్రోల్ చేయాలన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలనే ఆకురౌడీలు, చంద్రబాబునాయుడు సభలో నుంచి వెళ్లిపోతుంటే, అడుగో ముఖ్యమంత్రి వెళుతున్నాడని దెప్పిపొడిచారుకదా... చేతనైతే  ఆ అంశాన్ని దెప్పిపొడవాలని దివ్యవాణి సూచించారు.

వైసీపీ సోషల్ మీడియా విభాగం ఎన్నిచీప్ ట్రిక్స్ ప్లేచేసినా, తెలుగుదేశంపార్టీ కుటుంబసభ్యు లు వెంట్రుకమాత్రం కూడా పట్టించుకోరని దివ్యవాణి తేల్చి చెప్పారు. తనకుశక్తి సామర్థ్యం ఉన్నంతవరకు ఏపీ గడ్డమీద పుట్టిన అమ్మయిగా ఈరాష్ట్రాన్ని నడిపించే సమర్థనాయకు డైన చంద్రబాబునాయకత్వంలోనే పనిచేస్తానని దివ్యవాణి కుండబద్ధలుకొట్టారు.
 
 ముఖ్యమంత్రిఇంటికికూతవేటుదూరంలో, సీతానగరంలో యువతిపై అత్యాచారం జరిగి 40రోజులవుతోందని, ఇంత వరకు ఈముఖ్యమంత్రి నిందితులను ఎందుకుపట్టుకోలేక పోయారని దివ్యవాణి ప్రశ్నించారు. సదరుయువతి కేసును ప్రభుత్వం, డీజీపీ నీరుగార్చాలని చూస్తున్నారన్నారు. వివే కానందరెడ్డిహత్యకేసుని టీడీపీవారికి అంటగట్టి, తనవాళ్లను తప్పించడానికి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నాడని, అదేవిధంగా అత్యాచారం కేసుని కూడా తెరమరుగుచేయడానికి కుటిలయత్నాలు జరుగుతున్నాయన్నారు.

అధికారం, ప్ర భుత్వాన్ని చేతిలోఉంచుకున్న ముఖ్యమంత్రి, ఒక ఆడబిడ్డకు న్యాయం చేయలేకపోవడం సిగ్గుచేటన్నారు. అసెంబ్లీకి వెళ్లేటప్పుడు పెద్దమహారాజులా ముఖ్యమంత్రి పోలీసులను అడ్డుపెట్టుకొని వెళతాడుగానీ, ఆడబిడ్డలకు అదే పోలీసులతో ఎందుకు రక్షణ కల్పించలేకపోతున్నాడని దివ్యవాణి నిలదీశారు. తనగుండె జగన్ ... జగన్ అని కొట్టుకుంటుందని ఒకామె అంటే, గన్ కంటే ముందు జగనన్న వస్తాడని మరో మహాతల్లి సెలవిచ్చిందని, ఆడబిడ్డకు జరిగిన అన్యాయంపై ఆ తల్లులంతా ఇప్పుడెందుకునోరు మెదపడంలేదన్నారు?

ఎన్ని గన్నులు రాష్ట్రంలోని మహిళలకు రక్షణ కల్పిస్తున్నాయో, ఎందరు జగనన్నలు అబలలకు రక్షణ కల్పిస్తున్నారో చెప్పాలని దివ్యవాణి డిమాండ్ చేశారు. టీడీపీనేతలపై అక్రమ కేసులపెట్టి వేధించడం, జైళ్లకుపంపడంపై ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధలో సగమైనా, మహిళలను రక్షించడంలో ఈ ప్రభుత్వానికి ఉండుంటే బాగుండేదన్నారు. తెలంగాణలోని జగనన్న బాణం ఈమధ్యన గొప్ప వాక్యాలు చెబుతోందని, సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, కామన్ మ్యాన్ అని వ్యాఖ్యానించిందన్నారు.

అదేవిధంగా ఈముఖ్యమంత్రి ఎందుకుకామన్ మ్యాన్ లా ఆడబిడ్డలను, రాష్ట్రప్రజలను ఎందుకు కాపాడలేకపోతున్నాడని దివ్యవాణి ప్రశ్నించారు. వై.ఎస్. కూతుర్నికదా అని షర్మిల ఏది పడితే అది మాట్లాడుతున్నారని, గతప్రభుత్వం రాక్షస ప్రభుత్వం అనే ముందు, కోడికత్తి, వివేకానందరెడ్డి  హత్యకేసు ఘటనల్లో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నప్రభుత్వం కంటే రాక్షసప్రభుత్వం మరోటి ఉండబోదనే నిజాన్ని ఆమె గ్రహించాలన్నారు.

అత్యాచారాలు చేసేవాళ్లను ప్రభుత్వం ప్రోత్సహించకుండా కఠినంగా వ్యవహరిస్తేనే రాష్ట్రంలో ఆడ బిడ్డలు ప్రశాంతంగా ఉంటారన్నారు. తన నియోజకవర్గం లోని మంగళగిరి ప్రాంతంలో యువతిపై అత్యాచారం జరిగితే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎందుకు స్పందించడంలేదన్నారు. నిందితులను ఈప్రబుత్వం పట్టు కొని శిక్షించేవరకు టీడీపీ ఈవిషయాన్ని అంత తేలిగ్గా వదిలి పెట్టదని దివ్యవాణి ప్రభుత్వాన్నిహెచ్చరించారు. సీతానగరం బాధితురాలికి ముఖ్యమంత్రి తగినరీతిలో న్యాయంచేసేవరకు ఆయన్ని నిత్యం ప్రశ్నిస్తూనే ఉంటామని ఆమె చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యే సినీ ప్రముఖులు ఎవరంటే..?

పాత రోజులను గుర్తు చేసిన మెగాస్టార్... చిరంజీవి స్టన్నింగ్ లుక్స్...

శ్రీతేజ్ కుటుంబానికి రూ.2కోట్లు నష్టపరిహారం.. అల్లు అరవింద్, దిల్ రాజు ప్రకటన (video)

Pushpa-2: పుష్ప2 కలెక్షన్లు కుమ్మేసింది.. 20వ రోజు రూ.14.25 కోట్లు వసూలు

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

Foods to lower cholesterol ఈ ఆహారాలతో చెడు కొవ్వుకు చెక్

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

తర్వాతి కథనం
Show comments