Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజా ఎక్కడ...? పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు...? ఎవరు?

రోజా. రాజకీయాల్లో కంటే నటిగానే ఈమెకు మంచి పేరుంది. అటు తెలుగు, ఇటు తమిళ బాషలో ఈమె నటించిన సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. రోజా తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకుల ఈలలు, గోలలు అంతా ఇంతా కాదు. అలాంటి రోజా రాజకీయాల్లోకి వచ్చి సినిమాల గురించి పట్టిం

Webdunia
శుక్రవారం, 21 జులై 2017 (15:47 IST)
రోజా. రాజకీయాల్లో కంటే నటిగానే ఈమెకు మంచి పేరుంది. అటు తెలుగు, ఇటు తమిళ బాషలో ఈమె నటించిన సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. రోజా తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకుల ఈలలు, గోలలు అంతా ఇంతా కాదు. అలాంటి రోజా రాజకీయాల్లోకి వచ్చి సినిమాల గురించి పట్టించుకోవడం మానేశారు. అడపాదడపా సినిమాల్లో నటించినా పెద్దగా ఆడలేదు ఆ సినిమాలు. దీంతో బుల్లితెరపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు రోజా. 
 
అయితే ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉన్న రోజా నగరి నియోజవర్గంలో పెద్దగా అభివృద్థి చేయడం లేదట. అందుకే రోజాపై నగరి నియోజకవర్గ ప్రజలు గుర్రుగా ఉన్నారు. అప్పుడెప్పుడో మా ఎమ్మెల్యే మా నియోజకవర్గానికి వచ్చింది సర్. ఆ తరువాత కనిపించలేదు. కిందటిసారి వచ్చినప్పుడు వాటర్ ఫిల్టర్ ప్రారంభించారు... వెళ్ళారు సర్. మళ్ళీ అతీగతీ లేకుండా నగరి నియోజకవర్గ ప్రజలు మీడియాకు చెప్పుకుంటున్నారు. 
 
ఇక రోజా అభివృద్ధి ఏమాత్రం చేయకుండా నగరిని మరింత వెనక్కి తీసుకెళ్ళి పోతున్నారంటూ నగరి నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల ప్రజలు రోజాపై పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైపోయారు. ఐదు గ్రామాల ప్రజలు నగరి పోలీస్టేషన్లో రోజా కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసి ఆ తరువాత కరపత్రాలను అంటిచడానికి సిద్థమై పోతున్నారట. దీనిపై ఇప్పటికే వైసిపి నేతలు కొంతమంది గ్రామస్తులతో మాట్లాడినా ఫలితం లేకుండా పోయిందట. ఏం జరుగుతుందో చూద్దాం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: జూలై 4న విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' చిత్రం విడుదల

Pitapuram: లోక కళ్యాణం కోసం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అంబాయాగం

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments