Webdunia - Bharat's app for daily news and videos

Install App

2.40 లక్షల ఉద్యోగాల భర్తీ ఏమైంది?: సోమువీర్రాజు

Webdunia
సోమవారం, 21 జూన్ 2021 (05:35 IST)
అధికారంలోకి రాకముందు ఎపీపీసీఎస్సీ ద్వారా 2.40 లక్షల ఉద్యోగాలిస్తామని నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ఏమైందని వైఎస్.జగన్ మోహన్ రెడ్డిని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఉద్యోగాలను భర్తీ చేయకుండా 6లక్షల 3 వేల ఉద్యోగా లిచ్చినట్లు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి డాబుసరి అసత్య ప్రచారాలు చేసుకోవడాన్ని సోమువీర్రాజు తప్పుపడ్డారు.

ఈ 6.03 లక్షల ఉద్యోగాల్లో ఎపీపీఎస్సీ ద్వారా ఎన్ని ఉద్యోగాలు భర్తీచేశారో చెప్పాలన్నారు. ఎపీపీఎస్సీ ద్వారా భర్తీకి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా మీ ప్రచారానికి అవసంమైన రీతిలో తక్కువ జీతానికి నియామకాలు చేపట్టి వాటినే ప్రభుత్వోద్యోగాలుగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.

ఇదిచాలదన్నట్లు ఇప్పటికే పనిచేస్తున్న కొందరు ఉద్యోగులకు మరల ఉద్యోగాలిచ్చినట్లు అసత్య ప్రచారం చేసుకోవడం నిరుద్యోగులను మోసం చేయడమే అన్నారు.
 
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగనే ఏటా మెగా డిఎస్సీని నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. కాని రెండేళ్లయినా ఒక్కపోస్టు భర్తీ చేయలేదన్నారు. అధికారంలోకి వస్తూనే ఉద్యోగులకు పీఆర్సీ అమలుచేస్తామన్నారు. కాని రెండేళ్లయినా అమలు కాలేదన్నారు. అన్ని సంస్థల్లో పనిచేసే కాంట్రాక్టు సిబ్బందిని రెగ్యలర్ చేస్తామన్నారు. కాని ఆ ప్రస్తావనే లేదు. లక్షలాది ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్రలగ్బాలు పలికారు.

మీ నవరత్నాల అమలు కోసం ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాల్లో అత్యల్ప జీతాలపై పనిచేసేందుకు గ్రాడ్యుయేట్లను నియమించుకున్నారు. అలాగే మీ పాలన. ప్రచారం కోసం వాడుకోడానికి లక్షలకు పైగా వాలంటీర్లను నియమించుకున్నారు. వారికి ప్రజాధనం నుంచి రూ.5 వేల జీతాలిస్తున్నారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి అందులో అప్పటికే పనిచేస్తున్న రూ.50 వేల మంది సిబ్బందికి కూడా కొత్తగా ఉద్యోగాలిచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఏ రాష్ట్ర ప్రభుత్వ మైనా కనీసం నాలుగైదువేల పోలీసు ఉద్యోగాల భర్తీ చేసుకునేది. కోవిద్ వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలోని చాలా మంది నిరుద్యోగులు పోలీసు ఉద్యోగాల కోసం లక్షలు ఖర్చుచేసి శిక్షణ తీసుకున్నారు.

కాని పదుల సంఖ్యలోనే బర్తీ చేసుకున్నారన్నారు. ఈ అసత్యప్రచారాలు ఇకనైనా కట్టిపెట్టాలని ప్రజలు గమనిస్తున్నా రని నవ్వుకుంటున్నారని ఎత్తిపొడిచారు.

ఉద్యోగాల భర్తీకై తక్షణం నోటిఫికేషన్ విడుదల చేయాలని యువమోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఆందోళన కార్యక్రమలు కొనసాగుతున్నాయని ఈ ఉద్యమం మరింత తీవ్రరూపం దాల్చకముందే ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని హెచ్చరించారు. నిరుద్యోగులకు హామీ ఇచ్చిన 2.40 లక్షల ఉద్యోగాలను ఎపీపీఎస్సీ ద్వారా తక్షణం భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun అల్లు అర్జున్ రాక మునుపే సంధ్యలో తొక్కిసలాట? వీడియో వైరల్

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments