Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణాలు తీస్తున్న ఆంధ్రా రోడ్లు - గుంతలో పడి బైకర్ మృతి

Webdunia
గురువారం, 28 జులై 2022 (15:41 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రహదారులు అత్యంత దయనీయంగా ఉన్నాయి. ఈ రోడ్లు ఇప్పటికే అనేక మంది ప్రాణాలను హరించాయి. తాజాగా వెస్ట్ గోదావరి జిల్లాలో ఓ బైకర్ మృత్యువాతపడ్డారు. మరో వారం రోజుల్లో సౌతాఫ్రికాకు వెళ్లాల్సిన ప్రవీణ్... బుధవారం రాత్రి అత్తిలి నుంచి తాడేపల్లిగూడెం వెళుతుండగా రోడ్డుపై ఉన్న గంతలో పడి ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, అత్తిలికి చెందిన ప్రవీణ్ కుమార్ దక్షిణాఫ్రికాలో టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. నాలుగు నెలల క్రితం సౌతాఫ్రికా నుంచి స్వగ్రామానికి వచ్చాడు. మరో వారం రోజుల్లో మళ్లీ ఆయన సౌతాఫ్రికాకు వెళ్లాల్సివుంది. 
 
బుధవారం రాత్రి ఒక పనిమీద అత్తిలి నుంచి తాడేపల్లిగూడెంకు బైక్‌పై ప్రవీణ్ బయలుదేరాడు.  అయితే, రావిగుంట వద్ద రోడ్డుపై గోతులు కనిపించక వేగంగా అలాగే, ముందుకు వెళ్ళాడు. బైక్ గొయ్యిలోకి వెళ్లి అదుపుతప్పింది. ఈ ఘటనలో ఆయన బైక్‌పై నుంచి ఎగిరిపడ్డాడు. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయం తగలగడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కుమారుడు మృతితో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments