Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీమ జిల్లాలను ఆదుకుంటాం... బీజేపీ నేతలు

Webdunia
మంగళవారం, 3 మార్చి 2015 (20:58 IST)
భూగర్భ జలాలు అడుగంటిపోయి కరువుతో అల్లాడిపోతున్న రాయలసీమను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర మంత్రి మాణిక్యాల రావు స్పష్టం చేశారు. రాయలసీమ జిల్లాలలో కరువు పర్యటన చేస్తున్న వారు మంగళవారం చిత్తూరు జిల్లాలోని పడమటి మండలాలలో పర్యటించారు. ఎండిపోయిన దుర్భిక్ష పరిస్థితులను చూసి నాయకులు చలించిపోయారు.

ప్రధానంగా సాగునీరు, తాగునీటికి కరువు ఏర్పడిందని అన్నారు. ఇలాంటి పరిస్థితులలో రాయలసీమను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందనే అంశాన్ని తాము గుర్తించామని అందుకే తమ పార్టీ తరపున పర్యటనలు చేపట్టినట్లు ఆయన వివరించారు.
 
చిత్తూరు జిల్లాలో పర్యటన ముగించుకున్న బృందం నేరుగా కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో అడుగు పెట్టింది. అక్కడ పూర్తి స్థాయిలో ఎండిపోయిన బత్తాయి తోటలను పరిశీలించారు. ఇక్కడ పరిస్థితులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి న్యాయం చేస్తామని వారు తెలిపారు. ఈ బృందంలో మాజీ మంత్రి పురందరీశ్వరీ, రాష్ట్ర శాఖ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి తదితరులు ఉన్నారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments