Webdunia - Bharat's app for daily news and videos

Install App

సజావుగా ఎంసెట్ కౌన్సిలింగ్ : సుప్రీంను ఆశ్రయిస్తాం!

Webdunia
మంగళవారం, 29 జులై 2014 (18:59 IST)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంసెట్ కౌన్సిలింగ్ బుధవారం జరుగనుంది. ఈ ప్రక్రియను సజావుగా కొనసాగేందుకు వీలుగా సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. చట్టప్రకారం ప్రవేశాలను మండలి చేపడుతుందని వేణుగోపాల్ రెడ్డి వెల్లడించారు. అడ్మిషన్లు, కౌన్సిలింగ్‌ను ఆపమని సుప్రీం కోర్టు పేర్కొనలేదని ఆయన చెప్పారు. 
 
విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా త్వరగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టుకు మండలి విన్నవించనున్నట్లు వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. చట్టప్రకారం అడ్మిషన్లు జరిపే అధికారం ఉన్నత విద్యా మండలికి ఉందని వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. 
 
కౌన్సిలింగ్ త్వరగా ప్రారంభించాలని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విన్నపాలు వస్తున్నాయని చెప్పారు. ఆగస్టు 7 నుంచి విద్యార్థుల సర్టిఫికేట్ల పరిశీలన జరుగుతుందని తెలిపారు. ఆగస్టు 4న సుప్రీం కోర్టు తీర్పు తర్వాత మళ్లీ సమావేశమవుతామని చెప్పారు. ఆలస్యానికి కారణాలతో సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తామని చెప్పారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments