ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం: సీఎం జగన్

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (13:11 IST)
అమరావతి: అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ఉంటామని ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిస్పష్టం చేశారు. దీనిలో భాగంగా 10లక్షల 45వేల కుటుంబాలకు రూ.905.57 కోట్లు చెల్లిస్తున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. రూ.20వేల లోపు డిపాజిటర్ల ఖాతాల్లో రూ.666.84 కోట్ల నగదు జమ చేశామని పేర్కొన్నారు.

ప్రైవేట్ సంస్థ బాధితులకు న్యాయం చేసిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేదని, పేద ప్రజల కోసం ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని సీఎం జగన్ అన్నారు. మరికాసేపట్లో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అగ్రిగోల్డ్‌ డిపాజిట్‌దారుల బ్యాంకు ఖాతాల్లో పరిహారాన్ని సీఎం జగన్‌ విడుదల చేయనున్నారు. రెండో దశ కింద రూ.10 వేల నుంచి రూ.20వేల లోపు 7 లక్షల మంది డిపాజిట్‌దారులకు రూ.666.84 కోట్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.
 
మొదటి దశలో రూ.10 వేల లోపు డిపాజిట్‌దారులైన 3.40 లక్షల మందికి 2019లోనే రూ.238.73 కోట్లను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. దీంతో మొదటి, రెండో దశలో కలిపి మొత్తం 10.40 లక్షల మంది అగ్రిగోల్డ్‌ బాధితులకు ప్రభుత్వం రూ.905.57 కోట్లు పంపిణీ చేసినట్లు అయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

హైదరాబాద్ సీపీ సజ్జనార్‌పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments