Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగార్జున సాగర్ - ప్రకాశం బ్యారేజ్ వద్ద ఏరో డ్రోమ్‌లు

Webdunia
ఆదివారం, 18 జులై 2021 (12:40 IST)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నీటిపై తేలియాడే ఏరో డ్రోమ్‌లు అందుబాటులోకిరానున్నాయి. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ ఎగువన కృష్ణా నదిపై వాటర్ ఏరో డ్రోమ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు చేయగా.. దేశ వ్యాప్తంగా తొలి దశలో 14 చోట్ల వీటిని ఏర్పాటు చేయనున్నారు. 
 
ఇందులోభాగంగా విజయవాడ ప్రకాశం బ్యారేజీ ఎగువన, తెలంగాణలోని నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద ఒక్కొక్క వాటర్ ఏరోడ్రోమో‌లను అభివృద్ధి చేయనున్నారు. సముద్ర ఆధారిత పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా తొలి దశలో దేశవ్యాప్తంగా 14 చోట్ల వాటర్‌ ఏరోడ్రోమ్‌ల నిర్మాణానికి కేంద్ర నౌకాయాన శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు ఏపీ మారిటైమ్‌ అధికారులు వెల్లడించారు. 
 
ఇందులోభాగంగా విజయవాడ ప్రకాశం బ్యారేజీ ఎగువన, తెలంగాణ పరిధిలో నాగార్జున సాగర్‌ డ్యామ్‌ వద్ద ఒక్కొక్క వాటర్‌ ఏరోడ్రోమ్‌లను అభివృద్ధి చేయనున్నారు. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా మొత్తం రూ.450 కోట్లతో వాటర్‌ ఏరోడ్రోమ్‌లను అభివృద్ధి చేయనున్నారు. సీ ప్లేన్స్‌ ద్వారా మారుమూల ప్రాంతాలను సైతం ప్రధాన నగరాలతో అనుసంధానం చేయడంతో పాటు పర్యాటకులను ఆకర్షించే విధంగా వీటిని అభివృద్ధి చేస్తారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments