Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం.. యూట్యూబర్ నాని కాదు.. అతడు వేరే నాని!

Webdunia
ఆదివారం, 26 నవంబరు 2023 (09:36 IST)
ఇటీవలి కాలంలో వైజాగ్ నగరాన్ని ఉలిక్కిపడేలా చేసిన షాకింగ్ సంఘటనలలో ఒకటి ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన అగ్ని ప్రమాదం. నవంబర్ 19 రాత్రి విశాఖపట్నం జెట్టీలో పెద్ద అగ్నిప్రమాదం సంభవించి 30కి పైగా మత్స్యకారుల నౌకలు దగ్ధమయ్యాయి. ఇక ఈ కేసులో "నాని" పేరు బలంగా వినిపించడంతో ప్రముఖ యూట్యూబర్ ‘లోకల్ బోయి నాని’ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడే ఇప్పుడు ట్విస్ట్.
 
బోటులో మద్యం సేవిస్తున్న వాసుపల్లి నాని(23), అతని మామ అల్లిపిల్లి సత్యం ఈ ఘటనకు కారణమని పోలీసులు ఎట్టకేలకు గుర్తించారు. నాని నిర్లక్ష్యంగా సిగరెట్ పీకను పక్కనే ఉన్న పడవలోని నైలాన్ ఫిషింగ్ నెట్‌పైకి విసిరి మంటలను రేకెత్తించాడు. తీవ్రత ఉన్నప్పటికీ, ఇద్దరూ పారిపోయి ఇంటికెళ్లి నిద్రపోయారు, ఈ నేపథ్యంలో ఈ ఘటన వెనుక యూట్యూబర్ ‘లోకల్ బోయి నాని’ కాదని, ఇప్పుడు అరెస్టయిన మరో నాని అని పోలీసులు స్పష్టం చేశారు.
 
ఇంటెన్సివ్ విచారణ తరువాత, పోలీసులు నానిపై ఐపీసీ సెక్షన్లు 437, 428, 285 కింద అభియోగాలు మోపారు. కీలకమైన సాక్ష్యాలలో నాని జెట్టీ నుండి పారిపోతున్నట్లు చూపించే ఫుటేజ్ ఆధారంగా నానిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో దాదాపు 30 ఫిషింగ్ బోట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 18 పాక్షికంగా దగ్ధం అయ్యాయి. దీంతో దాదాపు రూ.20 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments