Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్తదానం చేసిన శునకం ... ఎక్కడ?

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2022 (11:41 IST)
సాధారణంగా రక్తదానం చేసేందుకు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న మనుషులే వెనుకంజ వేస్తున్న ఈ రోజుల్లో శునకాలు మాత్రం రక్తదానం చేసేందుకు సై అంటున్నాయి. తాజాగా ప్రాణాపాయంలో ఉన్న శునకాలకు రక్తం ఎక్కించి వాటి ప్రాణాలు రక్షించేందుకు వీలుగా శునకాల నుంచి రక్తాన్ని సేకరిస్తున్నారు. ఈ బృహత్తర కార్యక్రమం ఆదివారం విశాఖ నగరంలో ప్రారంభించారు. 
 
పెదవాల్తేరులోని పావ్స్ ఎన్ టెయిల్స్ ప్రీమియం పెట్ హాస్పిటల్‌లో ఈ రక్త సేకరణ శిబిరాన్ని నిర్వహించారు. శునకాల నుంచి రక్తాన్ని సేకరించేందుకు ఒక శిబిరాన్ని నిర్వహించడం దేశంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
చీఫ్ వెటర్నరీ సర్జన్ డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో పది శునకాల నుంచి రక్తాన్ని సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొన్ని సందర్భల్లో ముఖ్యంగా ప్రాణాపాయస్థిలో ఉన్న సమయంలో శునకాలకు కూడా ఆపరేషన్లు చేయాల్సి వస్తుందన్నారు. అలాంటి సమయంలో రక్తం అవసరం అవుతుందని, ఇందుకోసమే శునకాల నుంచి రక్తాన్ని సేకరించినట్టు ఆయన తెలిపారు. సేకరించిన రక్తాన్ని సురక్షితంగా నిల్వ చేసే ఏర్పాట్లు కూడా చేసినట్టు తెలిపారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments