Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా హత్య కేసులో మళ్లీ సుప్రీంకోర్టుకు సునీత - ఎందుకో తెలుసా?

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2023 (12:17 IST)
తన తండ్రి, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో డాక్టర్ సునీత మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఈ నెల 25 తేదీ వరకు అరెస్టు చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆమె సుప్రీంకోర్టులో చాలెంజ్ చేశారు. ఇదే అంశంపై ఆమె అపెక్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పును ఈ నెల 25వ తేదీన వెల్లడించనుందని, అందువల్ల తన పిటిషన్‌పై తక్షణం విచారణ చేపట్టాలంటూ ఆమె సుప్రీంకోర్టును కోరగా, దీనిపై శుక్రవారం సమాధానం చెబుతామని కోర్టు వ్యాఖ్యానించింది. 
 
కాగా, వివేకా హత్య కేసు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. ఇందులోభాగంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ భాస్కర్ రెడ్డితో అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిలను అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించింది. ప్రస్తుతం ఈ ఇద్దరిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తుంది. అలాగే, తెలంగాణ హైకోర్టు ఆదేశం మేరకు అవినాష్ రెడ్డి కూడా సీబీఐ విచారణకు బుధవారం నుంచి హాజరవుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో వివేకా హత్య కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ అవినాష్ రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ఈ నెల 25వ తేదీ వరకు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయొద్దని ఆదేశిస్తూ, ముందస్తు బెయిల్ మంజూరుపై ఆ రోజున తీర్పును వెలువరిస్తామని తెలిపింది. ఈ తీర్పును సస్పెండ్ చేయాలంటూ వివేకా కుమార్తె సునీత మరోమారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments