Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ వివేకా హత్య కేసు : రెండో రోజు విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2023 (10:11 IST)
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి రెండోరోజైన గురువారం సీబీఐ అధికారుల ఎదుట హాజరయ్యారు. హైదరాబాద్ నగరంలోని కోఠిలో ఉన్న సీబీఐ కార్యాలయానికి ఆయన గురువారం ఉదయమే చేరుకున్నారు. ఈ విచారణలో భాగంగా తొలి రోజు అయిన బుధవారం నాడు అవినాష్ రెడ్డి వద్ద సీబీఐ అధికారులు సుధీర్ఘంగా ఎనిమిది నుంచి తొమ్మిది గంటల పాటు విచారించారు. 
 
వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు జరిగిన పరిణామాలపై ఆరా తీశారు. నిందితులతో జరిపిన ఆర్థిక లావాదేవీలపై ఎంపీని సీబీఐ అధికారులు అనేక రకాలుగా ప్రశ్నించారు. ముఖ్యంగా రూ.40 కోట్ల డీల్‌కు సంబంధించి అవినాష్ రెడ్డి పాత్రపై ఆరా తీశారు. సహజ మరణంగా ఎందుకు చిత్రీకరించారంటూ సీబీఐ నిలదీసింది. 
 
మరోవైపు, సీబీఐ కొత్త ఆఫీసర్ వికాస్ సింగ్‌కు అవినాష్ రెడ్డి లేఖ రాశారు. వైఎస్ వివేకా హత్య జరిగిన రోజున దొరికిన లేఖపై దర్యాప్తు జరపాలని కోరారు. వికేకా ఫోనులో ఉన్న వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. వివేకా అల్లుడైన రాజశేఖర్‌ను ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

కల్కి 2898 AD నుంచి ప్రభాస్, దిల్జిత్ దోసాంజ్ 'భైరవ అంథమ్' రిలీజ్

షో రీల్ తో ఆకట్టుకున్న మిస్టర్ బచ్చన్

అంజలి బహిష్కరణ చేసింది ఎవరిని?

సినిమా రంగంలో సవాళ్లు నేపథ్యంగా ఇట్లు... మీ సినిమా

అనుపమ పరమేశ్వరన్ నటిసున్న పరదా లో దర్శన రాజేంద్రన్ పరిచయం

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

తర్వాతి కథనం
Show comments