Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ కాలేజీ ఫ్యాకల్టీ ఆ పనిచేసింది.. విద్యార్థిని ఆత్మహత్య.. సూసైడ్ లెటర్‌లో..?

సెల్వి
శుక్రవారం, 29 మార్చి 2024 (17:48 IST)
మహిళలపై వేధింపులు ఎక్కడపడితే అక్కడ జరుగుతూనే వున్నాయి. వయోబేధం లేకుండా మహిళలపై దేశంలో జరుగుతున్న అఘాయిత్యాలు అంతా ఇంతా కాదు. తాజాగా లైంగిక వేధింపుల కారణంగా ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. 
 
విశాఖ జిల్లాలో కొమ్మాది చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో ఫస్టియర్ విద్యార్థిని రూప శ్రీ కాలేజ్ ఫ్యాకల్టీ లైంగిక వేధింపులు భరించలేక శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది. కాలేజీ భవనం పై నుంచి దూకేసింది. కళాశాల ఫ్యాకల్టీ అభ్యంతరకరమైన ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తుండటమే తన ఆత్మహత్యకు కారణమని మృతురాలు సూసైడ్ నోట్‌లో రాసింది. 
 
కాలేజీలో లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ ఆ లేఖలో ఆమె తన తండ్రికి రాసింది. అసభ్యకరమైన ఫోటోలను తీసి వాటితో బెదిరించిందనీ.. ఆ ఫ్యాకల్టీ ఆ స్టూడెంట్స్‌ని ప్రోత్సహిస్తే ఎవరికి చెప్పాలని సూసైడ్ నోట్‌లో పేర్కొంది. 
 
కాలేజీలకు వెళ్లలేక, పోలీసులకు ఫిర్యాదు చేయలేక నలిగిపోతున్నాం. ఒకరు చస్తే కానీ ఈ విషయం ప్రపంచంలోకి రాదని తలచి తన ప్రాణాలు విడుస్తున్నట్లు ఆ లేఖలో మృతురాలు వెల్లడించింది. తనను క్షమించాలని ఆ లేఖ ద్వారా తల్లిదండ్రులను కోరింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం