Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాకుళంలో దారుణం - సచివాలయంలో బాలికపై వలంటీర్ అత్యాచారం

Webdunia
శనివారం, 6 నవంబరు 2021 (10:13 IST)
శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. గ్రామ పరిపాలన కోసం ఏర్పాటుచేసిన సచివాలయంలో ఓ బాలిక అత్యాచారానికి గురైంది. ఈ దారుణానికి ఒడిగట్టింది వలంటీరే కావడం గమనార్హం. శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్టం మండలం నడుకూరులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నడుకూరు గ్రామానికి చెందిన బి.హరిప్రసాద్ అనే వ్యక్తి స్థానికంగా ఉండే సచివాలయంలో వలంటీరుగా పని చేస్తున్నాడు. గత నెల 31వ తేదీ తన ఇంటికి సమీపంలో ఆడుకుంటున్న 12 యేళ్ళ బాలికకు మాయమాటలు చెప్పి సచివాలయానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. 
 
అతడికి రాంబాబు అనే యువకుడు పూర్తి సహాయ సహకారాలు అందించాడు. లైంగికదాడి తర్వాత ఆ బాలిక అపస్మారకస్థితిలోకి జారుకోవడంతో నిందితులిద్దరూ అక్కడ నుంచి పారిపోయారు. అయితే, తన చెల్లి కనిపించకపోవడంతో బాధితురాలి అక్క గ్రామంలో గాలిస్తూ సచివాలయానికి వచ్చింది. అక్కడ అపస్మారకస్థితిలోపడివున్న చెల్లిని చూసి బోరున విలపిస్తూ కేకలు వేసింది. ఆ తర్వాత దీనిపై తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments