Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప‌ని ఒత్తిడితో సచివాలయం కార్యదర్శి ఆత్మహత్య?

Webdunia
శనివారం, 3 జులై 2021 (20:42 IST)
జీతం 5 వేలు ప‌ని మాత్రం 12 గంట‌ల‌కు పైనే... పైగా ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌న్నీవీరి చేతుల‌పైనే న‌డ‌వాలి. దీనితో ప‌ని ఒత్త‌డి పెరిగి గ్రామ స‌చివాల‌యం సిబ్బంది స‌త‌మ‌త‌మ‌వుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇలానే ప‌ని ఒత్తిడి త‌ట్టుకోలేక ఒక స‌చివాల‌యం కార్య‌ద‌ర్శి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడని అతడి కుటుంబ సభ్యులు చెపుతున్నారు.

కృష్ణా జిలా మచిలీపట్నంలోని ఎస్.ఎన్. గొల్లపాలెం సచివాలయం కార్యదర్శి మల్లంపాటి సుధాకర్ ఆత్మహత్య కు పాల్ప‌డ్డాడు. మచిలీపట్నం ఇనగుదురుపేటలో నివాసం ఉంటున్న సుధాకర్, త‌న ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పని ఒత్తిడి వల్ల నిత్యం స‌త‌మ‌తం అయ్యేవాడ‌ని, చివ‌రికి అది భ‌రించ‌లేక ఆత్మహత్య చేసుకున్నట్టు బంధువులు పేర్కొంటున్నారు.

అయితే, దీనిపై స‌మ‌గ్రంగా విచార‌ణ చేస్తున్నామ‌ని పోలీసులు చెపుతున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. రెవిన్యూ ఉద్యోగులు, స‌చివాల‌యం సిబ్బంది సుధాక‌ర్ మృతికి సంతాపం తెలిపారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments