Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ నుంచి ఢిల్లీకి రైలు... తెలంగాణ తగలకుండా...

Webdunia
మంగళవారం, 30 జూన్ 2015 (08:27 IST)
ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ నుంచి ప్రముఖ నగరాలు, పట్టణాల మీదు ఢిల్లీకి ఓ నూతన రైలును ప్రవేశపెట్టాలని ప్రతిపాదన తీసుకువచ్చామని దాదాపు దానికి నిర్ణయం కూడా జరిగిపోయినట్లేనని  విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు తెలియజేశారు. ఏపీ ఎక్స్‌ ప్రెస్‌ ను విశాఖ మీదుగా నడిపించాలని భావిస్తున్నామని, దాదాపుగా అందుకు నిర్ణయం జరిగిపోయిందని ఆయన అన్నారు. 
 
ఈ రైలు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదని వివరించారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ విషయాన్ని లేవనెత్తనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. కాగా, విశాఖపట్నం మీదుగా ఏపీ ఎక్స్‌ ప్రెస్‌ ను నడపాలంటే తూర్పు కోస్తా రైల్వే జోన్ అంగీకారం పొందాల్సి ఉంటుంది. 
 
దీంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు తూర్పు కోస్తా రైల్వే అధికారులతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. విజయవాడ నుంచి విశాఖ, రాయ్ గఢ్ మీదుగా రైలును నడపాలని కూడా ఆలోచిస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే తెలంగాణను తాకకుండా ఏపీ ఎక్స్ ప్రెస్ ఢిల్లీ చేరుతుంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments