మణిక్రాంతి హత్య కేసు : స్కూటీలో ప్రదీప్‌తో వెళ్లిన ఆ వ్యక్తి ఎవరు?

Webdunia
మంగళవారం, 13 ఆగస్టు 2019 (11:06 IST)
విజయవాడ పట్టణంలోని సత్యనారాయణ పురం శ్రీనగర్ కాలనీలో భార్య తలనరికిన కేసులో సరికొత్త కోణం వెలుగులోకి వచ్చింది. భార్య మణిక్రాంతను హత్య చేసిన భర్త ప్రదీప్ కుమార్.. పాటు ఆయన బంధువుల ప్రమేయం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని ఆ ప్రాంతంలోని సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు నిర్ధారిస్తున్నాయి. 
 
సీసీ టీవీ దృశ్యాలకు తోడు మణిక్రాంతి సోదరి పూజారాణి చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు ఊతమిస్తున్నాయి. తన సోదరిని చంపుతుండగా చూసిన కొందరు తనకీ విషయం చెప్పారని పేర్కొంది. మణిక్రాంతిని చంపుతుండగా రికార్డైన దృశ్యాల్లో స్కూటీ ఆగి ఉండడం, ఆ తర్వాత మరో వ్యక్తి వచ్చి ఎక్కిన తర్వాత వెళ్లిపోయినట్టు ఉంది. 
 
స్కూటీపై వెళ్లిన వారిద్దరూ నిందితుడి బంధువులేననేది పూజారాణి ఆరోపణ. బంధువుల సహకారం లేకుండా ప్రదీప్ ఒక్కడే ఈ పని చేసి ఉండడని బాధితురాలి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్కూటీ రిజిస్ట్రేషన్ నంబరు కనిపిస్తే హత్య కేసులో చిక్కుముడి వీడుతుందని అధికారుల చెబుతున్నారు. 
 
కాగా, ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు మణిక్రాంతి కుటుంబ సభ్యులు, ప్రదీప్ బంధువులను విచారిస్తున్నారు. మణిక్రాంతి తలకోసం గాలిస్తున్న పోలీసులకు ఇప్పటి వరకు అది దొరకలేదు. తల లేకుండా పోస్టుమార్టం చేయడానికి వీల్లేదని, చేసినా మృతదేహాన్ని తీసుకెళ్లబోమని మణిక్రాంతి కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments