Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెదేపా ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం.. పోటీకి దూరంగా..

Webdunia
శనివారం, 25 సెప్టెంబరు 2021 (10:42 IST)
విజయవాడ లోక్‌సభ సభ్యుడు, టీడీపీ నేత కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. విజయవాడ అభ్యర్థిగా మరొకరిని చూసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు చెప్పినట్టు తెలుస్తోంది. 
 
నాలుగు రోజుల క్రితం చంద్రబాబును కలిసిన సందర్భంగా ఈ విషయాన్ని చెప్పినట్లు సమాచారం. తన కుమార్తె శ్వేత కూడా పోటీ చేయబోదని, ఆమె టాటా ట్రస్ట్‌కు వెళ్లిపోయిందని చెప్పారు. అయితే, ఎన్నికల్లో పోటీ చేయనంత మాత్రాన పార్టీ నుంచి బయటకు వెళ్లబోనని, టీడీపీతోనే కొనసాగుతానని నాని స్పష్టంచేశారు.
 
మరోవైపు నాని నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక నేతలు బుద్ధా వెంకన్న, బోండా ఉమా తదితరులతో విభేదాల కారణంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 
 
అయితే, నాని నిర్ణయం వెనుక బలమైన కారణమే వుంది. ఇటీవల ఆయన ఓ ప్రైవేట్ కార్యక్రమలో మాట్లాడుతూ, పార్టీ మనుగడపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, పార్టీ లేదూ బొంగూ లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వీడియో ఒకటి వైరల్ అయింది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్ అయినట్టు సమాచారం. అందుకే కేశినేని నాని ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 
 
ఇది కూడా చదవండిః ఆ గాత్రం మధురం.. గాన గంధర్వుడికి ఘన నివాళి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments