Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంద్రకీలాద్రికి భారీగా తరలివస్తున్న భవానీ భక్తులు

Webdunia
శనివారం, 16 అక్టోబరు 2021 (11:02 IST)
ద‌స‌రా ఉత్స‌వాలు ముగిసిన వెంట‌నే విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ దేవాల‌యం భవానీ దీక్షాప‌రులైన భ‌క్తులతో రద్దీగా మారింది. అన్ని క్యూలైన్లు భ‌వానీ భ‌క్తుల‌తో కిటకిటలాడుతున్నాయి. దీనితో నేడు, రేపు ఇంద్రకీలాద్రి పై విఐపి, ప్రోటోకాల్ దర్శనాలు రద్దు చేశారు. ఇక అన్నీ సాధారణ దర్శనాలే అని ప్ర‌క‌టించారు.
 
భవానీ భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు ఆల‌య చైర్మ‌న్ పైలా సోమినాయుడు వెబ్ దునియాకు చెప్పారు. భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైకి ఎటువంటి వాహనాలకు అనుమతించ‌డం లేదు. నేడు కూడా రాజరాజేశ్వరి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని ద‌ర్వించుకునేందుకు భ‌వానీ భ‌క్తులు క్యూ క‌ట్టారు. ఎర్ర‌ని దుస్తుల‌తో, నెత్తిన ముడుపులు క‌ట్టుని భ‌వానీ మాల‌తో భ‌క్తులు ఇంద్ర‌కీలాద్రికి పోటెత్తుతున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాక‌, భ‌క్తులు తెలంగాణా, క‌ర్నాట‌క‌ల నుంచి కూడా దుర్గ‌మ్మ ద‌ర్శానానికి వ‌స్తుండ‌టం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్ ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

కొన్ని రోజులు థియేటర్స్ లో వర్క్ చేశా, అక్కడే బీజం పడింది : హీరో ధర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments