Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెజవాడకు మణిహారం.. విజయవాడ వాసుల చిరకాల స్వప్నం... ఏంటది?

Webdunia
గురువారం, 20 ఆగస్టు 2020 (22:48 IST)
విజయవాడ నగర వాసుల చిరకాల స్వాప్నం నెరవేరనుంది. కొన్ని దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న దుర్గ గుడి ఫ్లై ఓవర్ వంతెన త్వరలోనే వినియోగంలోకి రానుంది. దీంతో విజయవాడ నగర వాసుల ట్రాఫిక్ కష్టాలు గణనీయంగా తగ్గిపోనున్నాయి. 
 
ఈ వంతెనను బెజవాడకు మణిహారంగా భావిస్తున్నారు. అలాంటి వంతెన ప్రారంభానికి ముహూర్తం కూడా ఖరారైంది. సెప్టెంబరు నాలుగో తేదీన విజయవాడ దుర్గగుడి ఫ్లై ఓవర్‌ను ప్రారంభించబోతున్నట్లు ఏపీ మంత్రి శంకర్ నారాయణ తెలిపారు. 
 
విజయవాడ దుర్గగుడి ఫ్లై ఓవర్ పనులను మంత్రి శంకర్ నారాయణ పరిశీలించారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్, ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. 
 
ఈ వంతెనను పరిశీలించిన తర్వాత మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ, దుర్గ గుడి ఫ్లై ఓవర్ దాదాపు పూర్తైందని చెప్పారు. చిన్న చిన్న పనులను ముగించి వచ్చే నెల 4న ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కనకదుర్గ వారధి, బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్‌ను వచ్చే నెల 4న ప్రారంభించి జాతికి అంకితం చేస్తామన్నారు. 
 
వచ్చే నెల 4న ఆర్ అండ్ బీ శాఖకు చెందిన 13 వేల కోట్ల రూపాయల పనులకు కేంద్ర‌మంత్రి గడ్కరీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని వెల్లడించారు. ఒక వైపు సంక్షేమం.. మరోవైపు రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శంకర్ నారాయణ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments