Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాల్ గర్ల్ అనుకుని ఆమెకు నీలి చిత్రాలు పంపా... విజయవాడలో కామాంధుడు...

చేతిలో ఫోన్ ఉంది... ఆపైన ఎన్ని కాల్స్ చేసినా, ఎన్ని సందేశాలు పెట్టినా, వీడియో కాల్స్... ఇంకా ఏ కాల్స్ అయినా బిల్లుతో చిల్లు పడుతుందనే బాధ లేదు. ఇకనేం... పోకిరీ, కామాంధులు రెచ్చిపోతున్నారు. తమ ఫోనుతో స్త్రీలకు చుక్కలు చూపిస్తున్నారు. వేధింపులు చేస్తున

Webdunia
శుక్రవారం, 9 జూన్ 2017 (13:08 IST)
చేతిలో ఫోన్ ఉంది... ఆపైన ఎన్ని కాల్స్ చేసినా, ఎన్ని సందేశాలు పెట్టినా, వీడియో కాల్స్... ఇంకా ఏ కాల్స్ అయినా బిల్లుతో చిల్లు పడుతుందనే బాధ లేదు. ఇకనేం... పోకిరీ, కామాంధులు రెచ్చిపోతున్నారు. తమ ఫోనుతో స్త్రీలకు చుక్కలు చూపిస్తున్నారు. వేధింపులు చేస్తున్నారు. కొందరు ఈ బాధలు తాళలేక బయటపడుతుంటే మరికొందరు వాటిని అలాగే భరిస్తున్నారు. తాజాగా విజయవాడలో ఇలాంటి ఘటన జరిగింది. 
 
విజయవాడ వన్ టౌనుకు చెందిన 40 ఏళ్ల గృహిణి ఫేస్ బుక్ మెసెంజరులో ఓ యువకుడు హాయ్.. హలో అంటూ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత మెల్లగా అశ్లీల చిత్రాలు పంపడం మొదలుపెట్టాడు. ఆమె అతడి ఖాతాను బ్లాక్ చేసే లోపుగానే తన ఫోన్ నెంబరు నుంచి వీడియో కాల్ చేయడం మొదలుపెట్టాడు. ఇష్టమొచ్చినట్లు అసభ్యకరంగా మాట్లాడాడు. దీంతో ఆమె అతడిని బ్లాక్ చేసింది. ఐనా అతగాడు వదల్లేదు. 
 
అశ్లీల చిత్రాలను పోస్టు చేస్తూనే వున్నాడు. దీనితో అతడికి బుద్ధి చెప్పాలనుకుని నిర్ణయించుకున్న సదరు మహిళ... అతడితో మాట కలిపింది. మెల్లగా అతడి చిరునామా తెలుసుకుని తను పనిచేస్తున్న సిబ్బందితో కలిసి వెళ్లి నేరుగా అతడిని చెప్పు తీసుకుని ఉతికింది. ఆ తర్వాత అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసు విచారణలో... ఆమె కాల్ గర్ల్ అనుకుని పొరబాటున ఇలా చేశానంటూ ఆ కామాంధుడు చెప్పాడు. కాగా అతడిని అరెస్టు చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments