Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఉనికి లేదనే ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు : విజయశాంతి

Webdunia
మంగళవారం, 29 జనవరి 2019 (14:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమకు ఉనికి లేదనే భావించడం వల్లే భారతీయ జనతా పార్టీ ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడం లేదని సినీనటి, కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై ఆమె తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ, వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తుందని తెలిపారు. 
 
అలాంటి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు ఏపీలోని ఏ ఒక్క పార్టీ ముందుకు రావడం లేదని వ్యాఖ్యానించారు. మరి కాంగ్రెస్ మద్దతు లేకుండా ప్రత్యేక హోదా ఎలా సాధిస్తారో అంతుచిక్కడం లేదన్నారు. హోదా కోసం పోరాడటంతో పాటు లక్ష్యాన్ని సాధించడానికి అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్‌ను బలపరుస్తూ తీర్మానం చేయడంమేలని ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. 
 
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కాంగ్రెస్ వల్లే సాధ్యమవుతుందని భావించి, కాంగ్రెస్‌కు మద్దతుపలికి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన వ్యక్తిగా తాను ఈ ప్రతిపాదన చేస్తున్నానని విజయశాంతి ట్విట్టర్‌లో తెలిపారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments