Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా మోదుగుల... విజయసాయిరెడ్డి తొలగింపు...

Webdunia
శుక్రవారం, 5 జులై 2019 (11:25 IST)
జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో విజ‌య‌సాయిరెడ్డి నియామ‌కం ర‌ద్దు అయింది. పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి.. పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌.. రాజ్య స‌భ స‌భ్యుడు అయిన విజ‌య సాయిరెడ్డిని ఢిల్లీలో ఏపి ప్ర‌భుత్వ ప్ర‌తినిధిగా నియ‌మించారు. అయితే, తాజాగా ఆయ‌న నియామ‌క ఉత్త‌ర్వులు ర‌ద్దు చేస్తూ ప్ర‌భుత్వం మ‌రో జీవో జారీ చేసింది. విజ‌య సాయిరెడ్డి నియామ‌కానికి సాంకేతిక కార‌ణాలు అడ్డుగా ఉన్న కార‌ణంగానే జీవో ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం చెబుతోంది. 
 
అయితే, ఇదే నియామ‌కం స‌మ‌యంలో ఆ మాత్రం అవ‌గాహ‌న లేకుండా ఎలా నిర్ణ‌యం తీసుకున్నారో అధికారులే చెప్పాలి. ఇక‌, ఆయ‌న స్థానంలో మాజీ ఎంపి మోదుగుల వేణుగోపాల‌రెడ్డికి అవ‌కాశం ఇవ్వాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. 
 
ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా ఎంపీ విజయసాయిరెడ్డిని తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయ‌టంతో ఇక ఇప్పుడు ఈ పోస్టులో ఎవ‌రిని నియ‌మిస్తార‌నే చ‌ర్చ మొద‌లైంది. 
 
వైసీపీ నుండి 22 మంది ఎంపీలు.. ఇద్ద‌రు రాజ్య‌స‌భ స‌భ్యులు ఉన్నా.. వారిలో ఎవ‌రికీ ఈ ప‌ద‌వి ఇవ్వ‌టానికి అవ‌కాశం లేదు. దీంతో.. గ‌తంలో ఎంపీగా ప‌నిచేసి అటు డిల్లీ వ్య‌వ‌హారాల్లోనూ.. ఇటు రాష్ట్ర ప‌రిపాల‌న మీద అవ‌గాహ‌న ఉన్న మాజీ ఎంపీ.. ఎమ్మెల్యే అయిన మోదుగుల వేణు గోపాల్ రెడ్డి పేరు ప‌రిశీల‌న‌కు వ‌చ్చినట్లు స‌మాచారం. 
 
ఆయ‌న తాజా ఎన్నిక‌ల్లో గుంటూరు నుండి ఎంపీగా పోటీ చేసి టీడీపీ అభ్య‌ర్ది గ‌ల్లా జ‌య‌దేవ్ మీద అయిదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తిరస్క‌ర‌ణ‌తో టీడీపీ ఎంపీ గెలిచారంటూ కోర్టులో కేసు కొన‌సాగుతోంది. దీంతో.. లోక్‌స‌భ స‌భ్యుడిగా.. ఏపీ ఎమ్మెల్యేగా ప‌ని చేసి అనుభ‌వం ఉన్న మోదుగుల వేణుగోపాల రెడ్డిని ఇప్పుడు ఢిల్లీలో ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌తినిధిగా నియ‌మించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్యాణ్‌రామ్‌ మెరుపు చిత్రం పాటలో పాల్గొన్న విజయశాంతి - తాజా అప్ డేట్

హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా కవర్ పేజీలో అల్లు అర్జున్

ఆది పినిశెట్టి బైలింగ్వల్ మూవీ శబ్దం థ్రిల్లింగ్ స్పైన్-చిల్లింగ్ ట్రైలర్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ ను మార్చిన తెజస్వని - పారితోషికం రెట్టింపు !

కాశీ మహా కుంభమేళాలో తమన్నా భాటియా ఓదెల 2 టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

తర్వాతి కథనం
Show comments