Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపి ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్, రాజ్యసభ ఎన్నికల్లో ఓటేశారు, టెన్షన్లో సహచర సభ్యులు

Webdunia
సోమవారం, 22 జూన్ 2020 (22:52 IST)
ఏపీ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే శ్రీనివాసరావుకి కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయింది. దీనితో ప్రభుత్వ వర్గాల్లో ఒక్కసారి టెన్షన్ కనిపిస్తోంది. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి కరోనావైరస్ రావడం మొదటిది. పైగా ఈయన ఇటీవలే జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఓటు కూడా వేసి రావడంతో ఆయనతో పాటు వెళ్లినవారందరికీ గుబులు పట్టుకుంది. ఇప్పటికే ఆయన గన్ మేన్‌కి కూడా కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది.
 
విజయనగరం జిల్లా ఎస్.కోట ఎమ్మెల్యే అయిన శ్రీనివాసరావు సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్‌తో కూడా భేటీ అయినట్లు తెలుస్తోంది. దీనితో ఆయనతో ఎవరెవరు కాంటాక్ట్ అయ్యారో వారందరినీ హోం క్వారెంటైన్లో వుంచాల్సిన పరిస్థితి. మరోవైపు శ్రీనివాసరావు ఇటీవలే అమెరికా వెళ్లివచ్చినట్లు చెపుతున్నారు. అక్కడ నుంచి వచ్చిన ఆయనకు కరోనా లక్షణాలు వుండటంతో హోంక్వారెంటైన్లో వుంచి పరీక్షలు చేశారు. తొలుత నెగటివ్ అని వచ్చింది కానీ ఆ తర్వాత పాజిటివ్ అని తేలింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments