Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలిసి చచ్చిపోదాం అంటూ ప్రియురాలిని రైలు కిందకు తోసిన ప్రియుడు... అతడు ఎస్కేప్, ప్రియురాలు...?

ప్రేమ. ఈ రెండక్షరాలకు అత్యంత అందమైన జీవితాన్ని అద్దే యువతీయువకులు కొందరైతే, నరకాన్ని చూపించేవారు మరికొందరు. ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుందని అంటుంటారు. తన లవ్ పార్టనర్ కోసం ప్రాణాలను అర్పించేందుకైనా సిద్ధంగా ఉంటారు చాలామంది. కానీ కొంతమంది మాత్రం కేవలం

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2016 (17:10 IST)
ప్రేమ. ఈ రెండక్షరాలకు అత్యంత అందమైన జీవితాన్ని అద్దే యువతీయువకులు కొందరైతే, నరకాన్ని చూపించేవారు మరికొందరు. ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుందని అంటుంటారు. తన లవ్ పార్టనర్ కోసం ప్రాణాలను అర్పించేందుకైనా సిద్ధంగా ఉంటారు చాలామంది. కానీ కొంతమంది మాత్రం కేవలం ఆకర్షణతో దగ్గరై, అనుకున్నవి నెరవేరగానే రెండో వ్యక్తిని వదిలించుకునేందుకు అనేక రకాలైన పథకాలు వేస్తుంటారు. ఈ క్రమంలో హత్య చేసేందుకయినా వెనుకాడరు. ఇలాంటి విషాద ప్రేమ ఘటన ఒకటి విజయనగరం జిల్లాలో జరిగింది.
 
విజయనగరం జిల్లాలో నీలవేణి, రామకృష్ణ అనే యువతీయువకులు ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకుందామని కూడా అనుకున్నారు. కాలం గడిచింది. మెల్లిగా రామకృష్ణ రంగు కూడా వెలిసింది. పెళ్లాడమని అడిగే ప్రియురాలితో తనకు రూ. 10 లక్షల కట్నం కావాలనీ, ఆ డబ్బు ఇస్తేనే తన తల్లిదండ్రులు పెళ్లికి సమ్మతిస్తారని లేదంటే కుదరదని తేల్చి చెప్పాడు. దాంతో షాక్ తిన్న నీలవేణి... ప్రేమించే ముందు తన ఆర్థిక పరిస్థితి తెలుసు కదా.. ఇప్పటికిప్పుడు రూ. 10 లక్షలు కావాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలంటూ బోరమంటూ విలపించింది. దీనితో రామకృష్ణ వేరే ప్లాన్ వర్కవుట్ చేశాడు. 
 
మన పెళ్లిని పెద్దలు ఒప్పుకోరు కాబట్టి ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుందాం రమ్మంటూ రైల్వే ట్రాకుపైకి తీసుకెళ్లాడామెను. ఐతే అక్కడికి వెళ్లిన రామకృష్ణ అతడి ఆలోచనను అమలుచేశాడు, ప్రియురాలిని ఒక్కదాన్నే రైలు కిందకు తోసేశాడు. అతడు మాత్రం అలా చూస్తుండిపోయాడు. ఆ యువతి కాళ్లు రెండూ తెగిపోయి అక్కడే విలవిలలాడిపోయింది. దీనితో స్థానికులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రియుడు పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments