Webdunia - Bharat's app for daily news and videos

Install App

హరికృష్ణ మృతి.. జగన్మోహన్ రెడ్డి సంతాపం.. సీటు బెల్టు పెట్టుకోలేదు..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నందమూరి హరికృష్ణ హఠాన్మరణ వార్తను విని దిగ్భ్రాంతికి గురయ్యారు. రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని విని షాకయ్యానని జగన్ అన్నారు.

Webdunia
బుధవారం, 29 ఆగస్టు 2018 (09:50 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నందమూరి హరికృష్ణ హఠాన్మరణ వార్తను విని దిగ్భ్రాంతికి గురయ్యారు. రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని విని షాకయ్యానని జగన్ అన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్‌ను పెట్టిన జగన్, హరికృష్ణ కుటుంబ సభ్యులకు ఆయన తన సానుభూతిని, సంతాపాన్ని వెలిబుచ్చారు. 
 
హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్రమైన గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. నందమూరి హరికృష్ణ మృతితో తెలుగుదేశం కార్యకర్తలు, ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 
 
సినీ నటుడు, తెలుగుదేశం మాజీ రాజ్యసభ సభ్యుడు అయిన నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని కారు ప్రమాదాలు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. హరికృష్ణ హైదరాబాదు నుంచి నెల్లూరు వెళ్తూ ప్రమాదానికి గురై మరణించారు. నందమూరి హరికృష్ణ సీటు బెల్టు పెట్టుకోలేదని తెలుస్తోంది. గంటకు దాదాపు 160 కిలోమీటర్ల వేగంతో హరికృష్ణ కారు నడిపినట్లు తెలుస్తోంది.
 
మరోవైపు మాజీ ఎంపీ శ్రీ నందమూరి హరికృష్ణ గారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని తెలిసి చింతిస్తున్నాను. శ్రీ ఎన్టీఆర్‌గారి కుమారుడైన ఆయన నాకు వ్యక్తిగతంగా మంచి మిత్రుడు. హరికృష్ణ గారు ముక్కుసూటి మనిషి, ఆపదలో ఉన్న వారికి సాయం చేసే మంచి మనసున్న వ్యక్తి అని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments