Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఆర్ఎస్‌లో ఆహ్వానం అదుర్స్‌... తరువాత‌ వెళ్లితే డోంట్ కేర్స్‌... జంపింగుల‌పై విహెచ్

Webdunia
గురువారం, 2 జులై 2015 (21:53 IST)
ఏ పార్టీలో ఉన్న‌వారినైనా పిలవ‌డం దండేసి పార్టీలోకి చేర్చుకోవ‌డం టీఆర్ఎస్లో అదిరేలా ఉంటుందని... ఆ తర్వాత మ‌రుస‌టి రోజుకే అక్క‌డ మ‌న‌ల్ని ప‌ట్టించుకునే దిక్కు కూడా ఉండ‌ర‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు వీహెచ్ అభిప్రాయపడ్డారు. ఉన్నచోట గౌర‌వంగా ఉండాలో అక్క‌డ‌కెళ్లి భంగ‌ప‌డాలో తేల్చుకోవాల‌ని ఆయ‌న అన్నారు. టీఆర్ఎస్ నైజ‌మే అద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. వెళ్ళిన చాలామంది గ‌తి ఇదేన‌ని ఆయ‌న చెప్పారు.
 
కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ టీఆర్ఎస్‌లో చేరిన వ్యవహారంపై ఆయన స్పందిస్తూ... డీఎస్ కాంగ్రెస్‌ను వీడితే పార్టీకి నష్టమేమీ లేదన్నారు. నిందితుల బెయిల్ షరతులలో ర్యాలీలు, ప్రసంగాలు చేయవద్దని నిబంధనలు పెట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ వి.హనుమంతరావు పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసులో నిందితుడుగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విషయమై న్యూఢిల్లీ లోని మీడియాతో ఆయన మాట్లాడుతూ... కేసు నుంచి నిర్దోషిగా బయటపడినప్పుడే ర్యాలీలు, ప్రసంగాలు చేయాలని వ్యాఖ్యానించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments