Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇందిరా - ఎన్టీఆర్‌లు నాకు వ్యతిరేకంగా ప్రచారం చేసినా.. నన్ను ఓడించలేకపోయారు : వెంకయ్య

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2016 (08:36 IST)
నాకు వ్యతిరేకంగా ఉక్కు మహిళ ఇందిరా గాంధీ, తెలుగు ప్రజల ఆరాధ్యదైవం ఎన్టీఆర్ వంటి మహానేతలే నాకు వ్యతిరేకంగా ప్రచారం చేసి... నన్ను ఓడించలేకపోయారు. ఇక ఇప్పటి నాయకులు నాకు ఓ లెక్కా అంటూ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కాస్తంత కఠువుగా మాట్లాడారు. 
 
విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిలబడి పోరాటం చేసిన వ్యక్తి అన్న భావనతో నాదెండ్ల భాస్కర రావు వెన్నుపోటు పొడిచినప్పుడు వేరే పార్టీ అయినా ఎన్టీఆర్‌కు అండగా నిలిచాను. కానీ మేమంతా ఒక్కటే కాబట్టి అండగా నిలిచానని, బీజేపీ, టీడీపీ ఒక్కటేనని ప్రచారం చేశారు. నాపై విమర్శలు చేస్తున్నవారు పుట్టకముందే ఇందిరా గాంధీ, ఎన్టీఆర్‌లాంటి వారికి వ్యతిరేక పార్టీలో పోటీచేసి గెలిచినట్టు చెప్పారు. 
 
ముఖ్యంగా 1978లో నెల్లూరులోని 11 స్థానాల్లో పది కాంగ్రెస్‌ గెలిస్తే ఇందిరా గాంధీ వచ్చి ప్రచారం చేసినా మిగిలిన ఒక్క సీటులో నేనే గెలిచాను. ఆ తర్వాత ఎన్నికల్లో ఎన్టీఆర్‌ ఉదయగిరిలో ప్రచారం చేసినా జిల్లాలో పది టీడీపీ గెలిస్తే మిగిలిన ఒక్క సీటు నేనే గెలిచాను. ఇదంతా తెలియకుండా ఏదేదో మాట్లాడుతున్నారు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
 
'కులం, మతం, ప్రాంతం అనేవి తాత్కాలికం. మనం ఏం చేశామన్నది అందరికీ గుర్తుండిపోయేలా సేవ చేయాలి. ప్రజలకు మేలు చేయాలనే సిద్ధాంతాలతో యువకులు రాజకీయాల్లోకి రావాలి అని పిలుపునిచ్చారు. అలాగే, రాజ్యసభకు నాలుగోసారి ఎన్నిక కావడంపై మాట్లాడుతూ.. ఇప్పటికే మూడుసార్లు రాజ్యసభ ఇచ్చారు. ఇక వెంకయ్యకు అవకాశం ఇవ్వరని చాలామంది ఏదేదో రాశారు. అందువల్లే సీటు కోసం నేను టీడీపీకి దగ్గరవుతున్నానని అన్నారు. నేను బీజేపీ అధ్యక్షుడిగా చేశాను. ఎవరో ఇస్తే సీటు తీసుకుంటానా? అని వెంకయ్య ప్రశ్నించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

తర్వాతి కథనం
Show comments