Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమ‌ల ఘాట్ రోడ్ల‌లో వాహ‌నాల వేగ నియంత్ర‌ణ చ‌ర్య‌లు

Webdunia
శనివారం, 25 డిశెంబరు 2021 (18:15 IST)
తిరుమ‌ల ఘాట్ రోడ్ల‌లో ప్ర‌మాదాల నివార‌ణ కోసం వాహ‌నాల వేగ నియంత్ర‌ణ కోసం స్పీడ్ గ‌న్‌లు, స్పీడ్ బ్రేక‌ర్లు ఏర్పాటు చేయాల‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. నిర్ణీత వేగం నిబంధ‌న‌ను ఉల్లంఘించే వాహ‌నాల‌ను స్పీడ్ గ‌న్‌ల ద్వారా గుర్తించి జ‌రిమానాలు విధించాల‌న్నారు. టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలోని స‌మావేశ మందిరంలో శ‌నివారం అధికారుల‌తో ఆయ‌న వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో స‌మావేశం నిర్వ‌హించారు.
 
 
ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ, భారీ వ‌ర్షాల‌కు దెబ్బ‌తిన్న తిరుమ‌ల రెండో ఘాట్ రోడ్డు, శ్రీ‌వారి మెట్టు మ‌ర‌మ్మతు ప‌నుల‌ను త్వ‌ర‌లో పూర్తి చేయాల‌న్నారు. ఘాట్ రోడ్ల‌లో డ్రోన్ల ద్వారా గుర్గావ్‌కు చెందిన భూమి డెవ‌ల‌ప‌ర్స్ సంస్థ నిర్వ‌హించిన జియ‌లాజిక‌ల్ స‌ర్వే, టోపోగ్ర‌ఫి స‌ర్వే నివేదిక‌ల‌ను జ‌న‌వ‌రి 10 లోగా అందించాల‌న్నారు.


ఈ నివేదిక‌ల‌ను అమృత యూనివ‌ర్సిటీలోని నిపుణుల‌కు పంపి వారి నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకోవాల‌ని ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. మోకాలిమెట్టు నుంచి జిఎన్‌సి వ‌ర‌కు ఒక‌టో ఘాట్ రోడ్డు నాలుగు లైన్లుగా విస్త‌రించే ప‌నుల‌కు సంబంధించి త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. అన్న‌మ‌య్య మార్గం అభివృద్ధిపై ఈవో అధికారుల‌తో చ‌ర్చించారు.
 
 
ఈ స‌మావేశంలో జెఈవో వీర‌బ్ర‌హ్మం, సివి ఎస్వో గోపీనాథ్ జెట్టి, ఎఫ్ఏ సీఎవో బాలాజి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వ‌ర‌రావు, ఎస్ఇ-2 జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, భూమి డెవ‌ల‌ప‌ర్స్ సంస్థ సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments