Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైవీ సుబ్బారెడ్డి చేతికి సుప‌ల్లి గ‌ణేశ్ కుమార్‌ రాజీనామా

Webdunia
శనివారం, 4 జూన్ 2022 (16:25 IST)
vasupalli
2019 ఎన్నికల్లో విశాఖ ద‌క్షిణ అసెంబ్లీ నియోజక‌వ‌ర్గం నుంచి టీడీపీ త‌ర‌ఫున ఎమ్మెల్యేగా గెలిచిన వాసుప‌ల్లి గ‌ణేశ్ కుమార్‌... కొంత‌కాలం క్రితం వైసీపీకి చేరువ అయిన సంగ‌తి తెలిసిందే. 
 
ఈ క్ర‌మంలో వైసీపీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా వాసుప‌ల్లి గ‌ణేశ్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే, నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త ప‌దవికి రాజీనామా చేస్తున్నట్లు శ‌నివారం వాసుప‌ల్లి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.
 
వెంటనే త‌న రాజీనామా లేఖ‌ను పార్టీ రీజ‌న‌ల్ కో ఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి, విశాఖ పార్ల‌మెంట‌రీ నియోజ‌కవ‌ర్గ ఇంచార్జీ అవంతి శ్రీనివాస్‌ల‌కు పంపించారు. 
 
విశాఖ జిల్లాకు సంబంధించి పార్టీ రీజ‌న‌ల్ కో ఆర్డినేట‌ర్ హోదాలో వైవీ సుబ్బారెడ్డి శ‌నివార‌మే తొలిసారి విశాఖ వ‌చ్చారు. ఇంతలో వాసుపల్లి రాజీనామా ఆయన చేతికి అందింది. సీతంరాజుతో విభేదాల కార‌ణంగానే వాసుప‌ల్లి పార్టీ ప‌ద‌వికి రాజీనామా చేశార‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి.  

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments