Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి రైల్వేస్టేషన్‌లో పట్టాలు తప్పిన వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్

తిరుపతి రైల్వేస్టేషన్‌లో వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఉదయం 2.30 నిమిషాలకు గ్యారేజ్ నుంచి రైలును స్టేషన్‌లోకి తీసుకువస్తుండగా పెద్ద శబ్దంతో రైలు పట్టాలు తప్పింది. దీంతో వెంటనే రైలును నిల

Webdunia
ఆదివారం, 22 జనవరి 2017 (12:07 IST)
తిరుపతి రైల్వేస్టేషన్‌లో వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఉదయం 2.30 నిమిషాలకు గ్యారేజ్ నుంచి రైలును స్టేషన్‌లోకి తీసుకువస్తుండగా పెద్ద శబ్దంతో రైలు పట్టాలు తప్పింది. దీంతో వెంటనే రైలును నిలిపేశారు ట్రైన్ డ్రైవర్. పట్టాలకు ఉన్న లింక్ వంగిపోవడంతో రైలు పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. రైలు పట్టాలు తప్పిన సమయంలో ప్రయాణీకులు ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. 
 
వెంటనే రైల్వేఅధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని రైలును మరమ్మత్తులు చేస్తున్నారు. వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్ వారంలో గురువారం ఒక్కరోజు మాత్రమే తిరుపతి నుంచి బయలుదేరుతుంది. అయితే ప్రతి ఆదివారం వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్‌ను గ్యారేజ్ నుంచి బయటకు తీసి మరమ్మత్తులు చేస్తుంటారు. ఈరోజు అదేవిధంగా మరమ్మత్తులు చేయడానికి తీసుకువస్తుండగా రైలు పట్టాల మీద నుంచి పక్కకి ఒరిగింది.
 
ఈ విషయాన్ని రైల్వేఅధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంపై రైల్వే పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. తిరుపతి రైల్వేస్టేషన్‌లోనే ఈ ప్రమాదం జరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments