Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ‌గ‌న్ ఇంత చిన్న వ‌య‌సులో ఇన్ని అబ‌ద్దాలు ఎలా చెబుతున్నాడో!

విజ‌య‌వాడ ‌: వైసీపీ అధినేత యాత్ర ప్రారంభించ‌డాన్ని తెలుగుదేశం నాయ‌కులు త‌ప్పుబ‌డుతున్నారు. ఇది దొంగ‌ల యాత్ర అంటున్నారు. టీడీపీ నాయ‌కుడు వ‌ర్ల రామయ్య మాట్లాడుతూ, గడప గడపకు వైసీపీ పెరుతో నేరస్తులైన వైసీపీ నేతలు మీ ఇళ్ళ ముందుకు వస్తున్నారు... ప్రజలంతా జ

Webdunia
బుధవారం, 6 జులై 2016 (18:50 IST)
విజ‌య‌వాడ ‌: వైసీపీ అధినేత యాత్ర ప్రారంభించ‌డాన్ని తెలుగుదేశం నాయ‌కులు త‌ప్పుబ‌డుతున్నారు. ఇది దొంగ‌ల యాత్ర అంటున్నారు. టీడీపీ నాయ‌కుడు వ‌ర్ల రామయ్య మాట్లాడుతూ, గడప గడపకు వైసీపీ పెరుతో నేరస్తులైన వైసీపీ నేతలు మీ ఇళ్ళ ముందుకు వస్తున్నారు... ప్రజలంతా జాగ్రత్త అన్నారు. వైసీపీ అధినేత జగన్ దిక్కుతోచని పరిస్థితుల్లో గడప గడపకు వైసీపీ కార్యక్రమం చేపడుతున్నాడ‌ని, విమ‌ర్శించారు. 
 
కొన్ని అబద్దపు ప్రశ్నలు తయారుచేసి వాటిని గడప గడపకు తీసుకువెళ్ళి టీడీపీకి మార్కులు వెయ్యాలని కోరుతానంటూ జగన్ కొత్త నాటకానికి తెరతీస్తున్నాడ‌ని ఆరోపించారు. చంద్రబాబుకు ప్రజలు డిస్టింక్షన్ మార్కులు వేసారు కాబట్టే అధికారం చేపట్టి ప్రజా రాజధాని నిర్మిస్తున్నార‌ని, అధికారం చేపడతానని జగన్ ఇప్పటికీ దింపుడు కళ్ళం ఆశతో ఉన్నాడ‌ని ఎద్దేవా చేశారు. 
 
33 వేల‌ కోట్లు విలువ చేసే రాజధాని భూములతో లక్ష కోట్లు అవినీతి జరిగిందంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నాడ‌ని ఆరోపించారు. జగన్ ఇంత చిన్న వయస్సులో ఇన్ని అబద్దాలు ఎలా చెబుతున్నాడో అర్ధం కావడంలేద‌న్నారు. ప్ర‌తిపక్ష నాయకుడిగా నీకు ఎన్ని మార్కులు వచ్చాయో ప్రజలను అడుగు. అప్పుడు నీకు కచ్చితంగా సున్నా మార్కులే వస్తాయ‌ని ఎద్దేవా చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన వాళ్లు టాలెంట్ చూపించాలనే డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్ చేస్తున్నాం : హోస్ట్ ఓంకార్

అమ్మ రాజశేఖర్ తల మూవీ రివ్యూ

మారుతీ టీమ్‌ ప్రొడక్ట్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న బ్యూటీ లుక్, మోషన్ పోస్టర్

వి వి వినాయక్ ఆవిష్కరించిన పూర్ణ ప్రదాన పాత్రలోని డార్క్ నైట్ టీజర్

జగన్నాథ్ మూవీ హిట్‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా: మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments