Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ర‌ణ‌రంగ‌మే! రాధా వ‌ర్సెస్ అవినాష్‌!!

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (20:02 IST)
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎప్పటి నుంచో దేవినేని, వంగవీటి వర్గాల మధ్య పోరు కొనసాగుతోంది. గతంలో టీడీపీలో ఈ రెండు కుటుంబాలు ఉండగా కూడా ఉప్పునిప్పుగా ఉండేవారు. కానీ చంద్రబాబు సర్దిచెప్పడంతో కొంతకాలం కలిసి పనిచేస్తున్నట్లు కనిపించారు. అయితే దేవినేని అవినాష్ వైసీపీకి వెళ్లిపోవడంతో అక్కడ ఉన్న వంగవీటి రాధా టీడీపీకి వచ్చేశారు.


ఇప్పుడు చంద్రబాబు కొత్త సమీకరణాలతో వీరిద్దరూ తొలిసారి తూర్పు నియోజకవర్గం నుంచి ముఖాముఖీ పోరులో తలపడే అవకాశం దక్కబోతోంది. రాజకీయాల్లో జూనియర్ గా ఉన్న అవినాష్ తో పోలిస్తే స్ధానికంగా ఉన్న కుల సమీకరణాలు రాధాకే అనుకూలంగా ఉండే అవకాశముంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు.
 
 
గత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా బలంగా వీచిన వైసీపీ పవనాల్ని తట్టుకుని టీడీపీ తరఫున గెలిచిన అతి కొద్ది మంది ఎమ్మెల్యేల్లో ఒకరైన గద్దె రామ్మోహన్ పార్టీ కోరిక మేరకు తన పాత నియోజకవర్గమైన గన్నవరానికి వెళ్లనున్నారు. దీంతో ఆయన సిట్టింగ్ స్ధానంలో వంగవీటి వారసుడైన రాధాను రంగంలోకి దింపాలని చంద్రబాబు భావిస్తున్నారు.


వాస్తవానికి గతంలో తూర్పు నుంచి పోటీ చేసి ఓడిపోయిన రాధాకు గత ఎన్నికల్లో మాత్రం అక్కడ వైసీపీ, టీడీపీ నుంచి కూడా సీటు దక్కలేదు. దీంతో ఆయన ఎప్పటికైనా తిరిగి తూర్పు నుంచే పోటీ చేయాలని పట్టు దలగా ఉన్నారు దీంతో వంగవీటి సేవల్ని గుర్తించి విజయవాడ తూర్పు నుంచి బరిలోకి దింపాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments