Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడకు వంగ‌వీటి రంగా జిల్లాగా పేరు పెట్టాలి...

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (13:36 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కొత్త జిల్లాల ప్ర‌తిపాద‌న పెట్టేసరికి, ఇపుడు దాని గురించి పెద్ద హాట్ టాపిక్ మొద‌లైంది. కొత్త జిల్లాల‌కు పేర్లు చాలా మంది సూచిస్తూ, ప్ర‌భుత్వాన్ని డిమాండు చేస్తున్నారు. కృష్ణా జిల్లాను రెండుగా చేస్తున్నార‌ని తెలిసి, జిల్లా ప్ర‌జ‌లు కొంద‌రు సంబ‌ర‌ప‌డుతుండ‌గా, కొంద‌రు దానిని వ్య‌తిరేకిస్తున్నారు. 

 
విజ‌య‌వాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ఒక జిల్లా, మ‌చిలీప‌ట్నం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ఇంకో జిల్లాగా విడిపోతోంది. దీనిలో మ‌చిలీప‌ట్టంకు కృష్ణా జిల్లాగా నామ‌క‌రం చేస్తార‌ని, విజ‌య‌వాడ జిల్లాకు ఎన్టీయార్ జిల్లాగా పేరు పెడ‌తార‌ని ప్ర‌భుత్వం సూచ‌న‌ప్రాయంగా తెలిపింది. 
 
 
కానీ, విజ‌య‌వాడ‌కు ఎన్టీయార్ పేరు క‌న్నా... వేరే పేర్లు కూడా ప‌రిశీలించాల‌ని డిమాండులు వ‌స్తున్నాయి.  విజ‌య‌వాడ‌కు వంగ‌వీటి మోహ‌న రంగా పేరు పెట్టాల‌ని రాధ రంగా మిత్ర మండలి నాయ‌కుడు చెన్నుపాటి శ్రీను డిమాండు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో  పునర్విభజన చేస్తూ 26 జిల్లాలు చేస్తోంది. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాగా నామకరణం చేసింది. కృష్ణా జిల్లాలో రెండో భాగానికి వంగవీటి మోహన రంగ పేరు పెట్టాలని కోరుతున్న‌ట్లు, చెన్నుపాటి చెప్పారు. ఇది రాధ రంగ మిత్ర మండలి కోరిక మాత్రమే కాదు, ప్రజల ఆకాంక్ష కూడా అని చెప్పుకొచ్చారు. రాధ రంగ మిత్ర మండలి తరపున ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేస్తున్నాం అని తెలిపారు.
 
 
కడప జిల్లాకు వైయస్సార్ పేరు పెట్టిన విధంగా , కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాల‌ని అన్నారు. తూర్పు, పశ్చిమ, ప్రకాశం జిల్లాలో కూడా ఆయా జిల్లాలకు రంగా పేరు పెట్టాలని కోరుతున్నార‌ని, కానీ రంగా పుట్టి పెరిగిన జిల్లా కృష్ణా జిల్లాకు రంగా పేరు పెట్టాలని కోరుతున్నామ‌న్నారు.

సంబంధిత వార్తలు

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments