వైవిబికి వంశీ క్షమాపణలు

Webdunia
శనివారం, 16 నవంబరు 2019 (19:48 IST)
టీడీపీ నేత రాజేంద్రప్రసాద్‌ (వైవిబి) వ్యాఖ్యలను బట్టే తాను అలా మాట్లాడాల్సి వచ్చిందని, అయినా రాజేంద్రప్రసాద్‌పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతున్నానని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వివరణ ఇచ్చారు. 

‘రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు.. నేను కాదనలేదు, చంద్రబాబుకు కూడా కాంగ్రెస్‌ రాజకీయ భిక్ష పెట్టింది.. ఆయన కూడా కాంగ్రెస్‌లోనే ఉన్నారా?, రంగులు వేసుకున్నవారు రాజకీయాలకు పనికిరారని ఎన్టీఆర్‌ను బాబు విమర్శించలేదా?, నా ఒక్కడి విషయంలోనే నైతిక విలువలు కనిపించాయా?’ అని ప్రశ్నించారు. 
 
‘టీడీపీకి 23 సీట్లు వచ్చాయి.. ఎన్టీఆర్‌ వస్తాడని మీరు భయపడితే నేనేం చేస్తాను’ అని వ్యాఖ్యానించారు. మీడియా మీట్‌లో విలేకరులు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకురాగా పై విధంగా వంశీ రియాక్ట్ అయ్యారు.

‘మాపై అనుమానంతోనే సోషల్‌మీడియాలో దుష్ప్రచారం చేయిస్తున్నారు. అడిగితే రాయించలేదని అంటున్నారు. మమ్మల్ని బూతులు తిట్టిన వ్యక్తికి సపోర్ట్‌గా లోకేష్‌ పోస్టులు పెడుతారు. వెబ్‌సైట్ల ద్వారా తప్పుడు ప్రచారంతో భయపెట్టాలని చూస్తున్నారు.

పార్టీ మారిన నలుగురు రాజ్యసభ సభ్యులను తొలగించాలని.. మోదీ ఇంటి దగ్గర ధర్నా చేద్దాం.. బాబు, లోకేష్‌ను రమ్మనండి. కావాలంటే ఎమ్మెల్యే పదవికి ఇప్పుడే రాజీనామా చేస్తాను’ అని వంశీ చెప్పుకొచ్చారు.
 
‘చంద్రబాబు నా తండ్రి లాంటి వారు కాళ్లకు దండం పెడితే తప్పేంటి?, కాళ్లకు దండం పెట్టడం వేరు.. కాళ్లు పట్టుకోవడం వేరు, నా వ్యక్తిగత పనులకు కోట్లు ఇచ్చారా?, ఎన్నికలప్పుడు ఏ పార్టీ అయినా ఫండ్ ఇస్తుంది, 2014లో అది కూడా ఇవ్వలేదు, రాజేంద్రప్రసాద్‌ కూడా డబ్బు తీసుకున్నారు అనే సరికి బాధపడ్డా.

అయ్యప్ప మాల వేసుకొని ఏదేదో చేశానని మాట్లాడుతున్నారు, మాల వేసుకున్న నన్నెందుకు తిట్టాడడని అందరూ అంటున్నారు, టీటీడీ బోర్డు, మెంబర్‌ పదవులు అమ్ముకున్నానా?, వెయ్యి కాళ్ల మండం కూల్చానా, దుర్గ గుడిలో క్షుద్ర పూజలు చేశానా?’ అని అడిగారు.
 
బోడె ప్రసాద్‌ ఖండన
ఎమ్మల్యే వంశీ ఆరోపణలను టీడీపీ నేత బోడె ప్రసాద్‌ ఖండించారు. ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌ ఇంటికి వెళ్లి మాట్లాడానని బోడె ప్రసాద్ తెలిపారు. స్నేహం వేరు... రాజకీయం వేరన్నారు. వ్యక్తిగత దూషణలు మంచిది కాదని బోడె ప్రసాద్ హితవుపలికారు.
 
రాజేంద్రప్రసాద్‌ పార్టీపై అలకబూనిన విషయం తెలిసిందే. వల్లభనేని వంశీ మోహన్ తనను వ్యక్తిగతంగా దూషించినా పార్టీ పట్టించుకోలేదని మనస్తాపానికి లోనయ్యారు. తాపీగా సాయంత్రం స్పందించడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు.

పార్టీ న్యాయ సహాయం చేస్తే వంశీపై పోరాడతానని అనుచరులతో ఆయన అన్నట్లు సమాచారం. అటు పార్టీ అగ్రనేతలు రాజేంద్రప్రసాద్‌తో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేశారని తెలియవచ్చింది.
 
ఈ నేపథ్యంలోనే రాజేంద్రప్రసాద్‌ను బోడె ప్రసాద్ కలిశారు. రాజేంద్రప్రసాద్‌కు బోడె ప్రసాద్‌ డబ్బు ఇచ్చారని వంశీ ఆరోపించారు. వంశీ ఆరోపణలను బోడె ప్రసాద్‌ ఖండించకపోవడంపై రాజేంద్రప్రసాద్ అలకబూనారు.

పార్టీ అధినాయకత్వం ఉదాసీనంగా ఉందనే భావనలో రాజేంద్రప్రసాద్ ఉన్నట్లు సమాచారం. టీడీపీ కార్యకర్తల అరెస్ట్‌పై బోడె స్పందించలేదని రాజేంద్రప్రసాద్ కినుకవహించారు. అధిష్ఠానం సూచనతో రాజేంద్రప్రసాద్‌ నివాసానికి బోడె ప్రసాద్ వెళ్లారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments