Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్‌ను నేను తిట్టలేదు... కేసీఆర్‌తో భేటీ ఎందుకయ్యాడు?: వీహెచ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు విమర్శలు గుప్పించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌లో ఏం చూసి పవన్ కల్యాణ్ ఆదర్శవంతుడని పొగిడారో చెప్పాలని వీహెచ్ డిమాండ్ చేశారు. వాస్తవం ఉంటే ప

Webdunia
సోమవారం, 15 జనవరి 2018 (13:06 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు విమర్శలు గుప్పించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌లో ఏం చూసి పవన్ కల్యాణ్ ఆదర్శవంతుడని పొగిడారో చెప్పాలని వీహెచ్ డిమాండ్ చేశారు. వాస్తవం ఉంటే పొగడాలని.. దాన్ని వదిలిపెట్టి పవన్‌ కేసీఆర్‌ను ఇంద్రుడు, దేవుడంటే ఎలా నమ్మాలని అడిగారు. డ్రగ్స్ కేసులో ఛార్జీషీట్‌ విడుదల చేయడంపై ఇన్ని రోజులు ఆగాలా అంటూ ప్రశ్నించారు. 
 
కెల్విన్‌ను తప్పించేందుకే పవన్ వెళ్లి కేసీఆర్‌ను కలిశారని ఆరోపించారు. ఈ కేసులో ఎంతో మంది ప్రముఖులు ఉన్నారని సభర్వాల్ తనకు స్వయంగా చెప్పారని వీహెచ్ చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్‌ను తాను తిట్టలేదని.. కేసీఆర్‌తో ఆయన భేటీ ఎందుకు కావాల్సి వచ్చిందని తెలిపారు. 
 
గతంలో పవన్ కల్యాణ్ ఎవడో తనకు తెలియదని కేసీఆర్ అన్నారని.. ఇప్పుడెలా పరిచయం ఏర్పడిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కెల్విన్‌పై చార్జ్ షీట్ వేయలేదని, అందుకే తనకు అనుమానం వచ్చిందని వీహెచ్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments