Webdunia - Bharat's app for daily news and videos

Install App

యురేనియం తవ్వకాలతో తెలుగు రాష్ట్రాలకు ముప్పు: పవన్ కళ్యాణ్

Webdunia
మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (07:59 IST)
యూరేనియం తవ్వకాలు తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. యురేనియం తవ్వకాల వల్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముప్పు వాటిల్లుతుందని అభిప్రాయపడ్డారు. 
 
జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీహెచ్ కలిశారు. యురేనియం తవ్వకాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. 
 
భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ యురేనియం తవ్వకాల వల్ల కృష్ణా జలాలు కలుషితమవుతాయని తెలిపారు. గర్భిణులు ఆ కలుషిత నీరు తాగితే పుట్టే బిడ్డ మానసిక వైకల్యానికి గురయ్యే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. 
 
రేడియేషన్‌తో మహిళల్లో గర్భసంచి సమస్యలు తలెత్తుతాయని స్పష్టం చేశారు. ఈ విషయం చాలా మంది జనసేన పార్టీ దృషికి తీసుకు వచ్చినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.

ఈ ఉపద్రవాలను దృష్టిలో పెట్టుకొని యురేనియం తవ్వకాల వల్ల ఎలాంటి నష్టం వాటిల్లనుంది..? కృష్ణా జలాలు ఎలా కలుషితం కాబోతున్నాయి..?. ఆ నీరు తాగిన ప్రజలకు ఎలాంటి జబ్బులు రాబోతున్నాయి..?  అన్నదానిపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి పర్యావరణ శాస్ర్తవేత్తలు, నిపుణులతో మాట్లాడి ప్రజల్లోకి వెళ్తామని చెప్పుకొచ్చారు.

అయితే రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు నిర్వహించేది రెండు, మూడు రోజుల్లో తెలియజేస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments