Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రగిరి నియోజకవర్గంలో ఎదురులేని వైఎస్సార్సీపీ

Webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (09:00 IST)
చంద్రగిరి నియోజకవర్గంలో అధికార పక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ది కార్యక్రమాల వైపు ఆకర్షితులవుతున్నారు. రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకుపోయే ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తత్వం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

ముక్కోటి సమీపంలోని నారాయణ గార్డెన్స్ లో పలువురు టీడీపీ నేతలు ఎమ్మెల్యే చెవిరెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే చెవిరెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. 

రాష్ట్ర ప్రభుత్వం పట్ల, తాను చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరడాన్ని స్వాగతించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికే కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజా సంక్షేమం కోసం అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. 
 
తిరుచానూరు నుంచి..
మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ లో క్రియాశీలకంగా వ్యవహరించే నాయకులు వైఎస్సార్సీపీ లో చేరారు. దిలీప్ రాయల్, చంద్రశేఖర్ రాయల్, ఆచారి మహేష్, వాసు, మురళి తో దాదాపు 150 మంది టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ కండువాలు కప్పుకున్నారు. పార్టీ బలోపేతానికి తమ వంతు బాధ్యతగా పని చేస్తామని స్పష్టం చేశారు. 
 
వెంకటపతి నగర్ లో..
తిరుపతి రూరల్ మండలం వెంకటపతి నగర్ లో ప్రతిపక్షం లేకుండా పోయింది. టీడీపీ నుంచి క్రియాశీలకంగా వ్యవహరించే పలువురు నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికారి ప్రతినిధి చిన్ని యాదవ్ ఆధ్వర్యంలో చేరారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి వైఎస్సార్సీపీ లోకి స్వాగతించారు.

పార్టీలో చేరిన వారిలో టీడీపీ సీనియర్ నాయకులు వెంకటరమణ, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులు, ఇతర నాయకులు నరసింహులు, సులోచన, బాలకృష్ణ, లక్ష్మీనారాయణ లతో పాటు 55 మంది నేతలు ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Rohit: తను నా లక్కీ చార్మ్.. అందుకే సుందరకాండ చేశాం : నారా రోహిత్

బార్బరిక్.. ఫ్రీగా చూడాల్సిన మూవీ కాదని వాళ్లు డబ్బులు ఇచ్చారు : విజయ్ పాల్ రెడ్డి

సినిమాల్లోనే కాదు.. వ్యక్తిగతంగా లోపాలను వెతుకుతున్నారు : అనుపమ పరమేశ్వరన్

కపుల్ ఫ్రెండ్లీ లో సంతోష్ శోభన్, మానస వారణాసి ల కెమిస్ట్రీ సాంగ్

పవన్ చేతిపై ఉన్న టాటూ అక్షరాలకు అర్థమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments