Webdunia - Bharat's app for daily news and videos

Install App

జల్లికట్టు స్ఫూర్తి కావాలంటే పందుల పందేలు ఆడుకోండి.. సుజనా చౌదరి కామెంట్స్

తమిళ సంప్రదాయ క్రీడాపోటీలు జల్లికట్టు కోసం ఆ రాష్ట్ర యువత చేసిన ఉద్యమాన్ని స్ఫూర్తిగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత ప్రత్యేక హోదా కోసం మౌననిరసన ఉద్యమాన్ని చేపట్టనుంది. దీనిపై కేంద్ర మంత్రి, టీడీప

Webdunia
గురువారం, 26 జనవరి 2017 (10:28 IST)
తమిళ సంప్రదాయ క్రీడాపోటీలు జల్లికట్టు కోసం ఆ రాష్ట్ర యువత చేసిన ఉద్యమాన్ని స్ఫూర్తిగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత ప్రత్యేక హోదా కోసం మౌననిరసన ఉద్యమాన్ని చేపట్టనుంది. దీనిపై కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్ నేత సుజనా చౌదరి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 
 
జల్లికట్టు స్ఫూర్తి కావాలనుకుంటే వెళ్లి అదే ఆడుకోవాలని సుజనా ఎద్దేవా చేశారు. లేకపోతే కోళ్ల పందెలు, పందుల పందేలు ఆడుకోవచ్చని సుజనా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రానికి అన్యాయం జరిగితే ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు చూస్తూ ఊరుకోరని, రాష్ట్రానికి ఏ సెక్షన్ కింద ఏ రూల్ కింద అన్యాయం జరిగిందో చెబితే సమాధానం చెబుతానని ఆయన సవాల్ చేశారు. 
 
ప్రత్యేక హోదా ముగిసిన అంశమని కేంద్రమంత్రి సుజనాచౌదరి మరోసారి పునరుద్ఘాటించారు. రాజకీయ పార్టీలు అనవసరంగా విద్యార్థులను, యువతను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయని సుజనా ఆరోపించారు. ఇలాంటి ఆందోళన కార్యక్రమాల వల్ల రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం శూన్యమన్నారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments