Webdunia - Bharat's app for daily news and videos

Install App

యావత్ తెలంగాణాకు చిన్నమ్మే : బోరుమని విలపించిన కిషన్ రెడ్డి

Webdunia
బుధవారం, 7 ఆగస్టు 2019 (12:00 IST)
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం రాత్రి హఠాన్మరణం చెందింది. ఆమె పార్థీవదేహాన్ని చూసిన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కంటతడిపెట్టారు. సుష్మా స్వరాజ్‌ ఇక లేరనే వాస్తవాన్ని జీర్ణించుకోలేపోతున్నట్లు ఉద్వేగానికి గురయ్యారు. 
 
'సుష్మాజీ నాకే కాదు.. యావత్తు తెలంగాణకు చిన్నమ్మే. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించి రాష్ట్రం వచ్చేలా చేసిన ఆమె కృషిని ఎన్నటికీ మరువలేము. ప్రజా సమస్యలపై ఆమె స్పందించే తీరు మాలాంటి వారికి స్ఫూర్తి. సుష్మాస్వరాజ్‌ ఆత్మకు శాంతి కలగాలని కోరుకొంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను' అంటూ కిషన్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. 
 
కాగా, సుష్మా స్వరాజ్ భౌతికకాయానికి బీజేపీ కార్య నిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ఆమె మృతి తీరని లోటు అని చెప్పారు. 
 
ఆమె స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరన్నారు. దేశం ఓ గొప్ప నాయకురాలిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు, నేతల సందర్శానార్థం సుష్మ భౌతికకాయాన్ని మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఉంచనున్నట్లు చెప్పారు.
 
 
ఈరోజు సాయంత్రం లోధీ శ్మశాన వాటికలో ప్రభుత్వ లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. సుష్మాకు మంగళవారం రాత్రి గుండెపోటు రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే  కుటుంబ సభ్యులు ఆమెను ఎయిమ్స్‌కు తరలించారు. ఎయిమ్స్‌ వైద్యులు అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అనారోగ్య కారణాలతో 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments