Webdunia - Bharat's app for daily news and videos

Install App

బడ్జెట్‌పై అనుమానాలుంటే జైట్లీని కలవండి : వెంకయ్య ఉచిత సలహా!

Webdunia
ఆదివారం, 1 మార్చి 2015 (14:19 IST)
తాజాగా ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై ఏవైనా అనుమానాలు ఉంటే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలవాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఉచిత సలహా ఇచ్చారు. ఆయన ఆదివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ ‘సమస్యలుంటే చర్చించుకుందాం. బహిరంగ విమర్శలతో ఫలితం శూన్యం. బడ్జెట్‌లో ఏదైనా అనుమానాలుంటే అరుణ్ జైట్లీని కలవండి’ అంటూ ఓ ఉచిత సలహా ఇచ్చారు.
 
శనివారం జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌పై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు నిధుల కేటాయింపులో కేంద్రం తమకు మొండిచేయి చూపిందని తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా వ్యాఖ్యానించారు. 
 
ఇరువురు సీఎంల ఆగ్రహావేశాలను తగ్గించేందుకు వెనువెంటనే వెంకయ్య రంగంలోకి దిగారు. నిధుల కేటాయింపుపై జైట్లీతో మాట్లాడమని ఏపీ సీఎం చంద్రబాబుకు చెప్పానన్నారు. నిధుల కేటాయింపులకు సంబంధించి సవరణలు చేసేందుకు యత్నిస్తామని కేసీఆర్‌కు చెప్పానన్నారు. ఇక తెలుగు రాష్ట్రాలకు విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెంకయ్య హామీ ఇచ్చారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments